Viral: విమానంలో అసభ్యకర ప్రవర్తన.. క్యాబిన్‌ సిబ్బంది కూడా అభ్యంతరం ఏం చేశాడంటే..!

|

Oct 09, 2023 | 9:59 AM

విమానాల్లో కొందరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికులు, క్యాబిన్‌ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించాడు.

విమానాల్లో కొందరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికులు, క్యాబిన్‌ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించాడు. పంజాబ్ లోని జలంధర్ కి చెందిన అభినవ్ శర్మ గత ఆదివారం న్యూయార్క్‌ నుంచి ఢిల్లీకి ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణించాడు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులను దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రశ్నించిన విమాన సిబ్బందితో దురుసుగా వ్యవహరించాడు. క్యాబిన్ సూపర్ వైజర్ అతన్ని హెచ్చరించగా.. ఆమెను పరుష పదజాలంతో తిడుతూ హెచ్చరించాడు. ఫ్లైట్‌ ఢిల్లీలో ల్యాండ్‌ కాగానే సదరు ప్రయాణికుడిపై క్యాబిన్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్‌ చేశారు. కాగా, విమానాల్లో తరూచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..