మగ సాలీడు డ్యాన్స్‌ నచ్చిందా ఓకే! లేదంటే హింసించి చంపేసే ఆడ సాలీడు

Updated on: May 01, 2025 | 4:49 PM

సాలీళ్లను చూడగానే మనలో ఏదో తెలియని వణుకు. వాటి కాళ్లు, కదలికలు.. అన్నీ మనల్ని భయపెడతాయి. కానీ అవే లేకపోతే... మన ఇళ్లలో రకరకాల పురుగులు మనపై దండయాత్ర చేస్తాయి. సాలెగూళ్లలో ఆ పురుగులు చిక్కేలా చేసి... మనపై దాడి చెయ్యకుండా చేస్తున్నాయి. ఐతే.. తరంతులా సాలీళ్లను చూడగానే అమెరికన్లు భయపడతారు.

ఎందుకంటే అవి నల్లగా జూలుతో ఉంటాయి. తరంతులా సాలీళ్లు అర చెయ్యి సైజులో ఉంటాయి. అవి కదులుతుంటే.. భయంకరంగా ఉంటాయి. ఆ నల్ల రంగే భయపెడుతుంది. వీటిలో కొన్ని విషపూరితమైనవి ఉంటాయి. మరికొన్ని కుడితే ప్రాణాలకే ప్రమాదం. వాయిస్‌02: భయంకరమైన తరంతులా సాలీళ్లు బ్లూ కలర్‌లో నెమలి రంగుల్లో ఉంటే… ఏ మాత్రం భయం వెయ్యవు సరికదా… మనమే వాటిని పట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తాం. ఈ SAFFIRE ORNAMENTAL TARANTULA లు.. సాలీళ్ల జాతిలో పురాతనమైనవి. ఇవి ఆంధ్రప్రదేశ్ లోని దట్టమైన అడవుల్లో జీవిస్తున్నాయి. ఇవి చిన్న బల్లులు, కప్పలు, పక్షుల్ని తిని బతుకుతాయి. ఐతే… వీటిని అత్యంత వేగంగా అంతరించిపోతున్న జీవుల లిస్టులో చేర్చింది IUCN. అడవులు తగ్గిపోతుంటే.. మిగతా ప్రాణుల సంఖ్య తగ్గుతున్నట్లే.. వీటి సంఖ్యా తగ్గిపోతోంది. నేషనల్ జియోగ్రాఫిక్ రిపోర్ట్‌ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 45,000 కంటే ఎక్కువ రకాల సాలెపురుగులు ఉన్నాయి. ఇక నెమలి జంపింగ్ స్పైడర్.. సాలీడు జాతులలో ఒకటి. పీకాక్‌ జంపింగ్‌ స్పైడర్‌ కి.. దాని రూపం వల్లే ఈ పేరు. నెమలి పింఛం రంగుల్లో గమ్మత్తుగా ఉంటుంది. అంతేకాదూ… జతను ఆకట్టుకోవడానికి డ్యాన్సు కూడా చేస్తుంది. ఇది బొటన వేలంత పరిమాణంలో ఉంటుంది. సాలీడు తన నృత్యంతో ఆడ భాగస్వామిని ఆకట్టుకుంటుంది. మగ సాలీడు నృత్యానికి ఆడ సాలీడు ముగ్ధురాలైతే పర్వాలేదు. లేదంటే మగసాలీడుని ఆడసాలీడు హింసించి చంపేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూగుల్ డాట్‌ కాం కొన్న గుజరాతీ..! ఎంతకంటే ??

ఈ భూమిపైనే అతి పెద్ద భారీ అనకొండ ఇదేనట..!

సినిమా హీరోయిన్‌గా ‘గుప్పెడంత మనసు’ జగతి.. ఆంటీ టూ అందాల బ్యూటీ!

ఓ పక్క యుద్ధ పరిస్థితులంటే ఇంకో పక్క పాకిస్తానీతో దోస్తీనా..! ఛీ సిగ్గు చేటు

మేకప్‌ రూమ్‌కి పిలిచి మరీ.. గోపీచంద్‌కు క్లాసు పీకిన చిరు..!