తల్లికి రెండో పెళ్లి చేసిన 12 ఏళ్ల కూతురు వీడియో

Updated on: Aug 27, 2025 | 1:36 PM

ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీలు పెళ్లీలు చేసుకుంటూ పర్సనల్ లైఫ్ లో ఫుల్ బిజీ అవుతున్నారు. అలాగే కొందరు వివాహం జరిగిన కొద్ది రోజులకే విడాకులు తీసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. మరికొందరు మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత కూడా రెండో పెళ్లి చేసుకుంటూ తమ జీవితాన్ని సంతోషంగా గడపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

తాజాగా ఓ మలయాళ నటి ఆర్య రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఆమె ప్రేమించిన వ్యక్తికి కూడా రెండో వివాహం కావడం గమనార్హం. ఆర్యకు ఇప్పటికే వివాహమై 12 ఏళ్ల కూతురు ఉండగా పలు మనస్పర్ధలు తలెత్తడంతో భర్తతో విడాకులు తీసుకుంది. ఇక అప్పటినుంచి కోరియోగ్రాఫర్ శిబిన్ తో డేటింగ్ చేస్తోంది. మే నెలలో వీరిద్దరూ కలిసి ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ లవ్ బర్డ్స్ ఆగస్టు 21వ తేదీన ఏడు అడుగులతో ఒకటయ్యారు. ఇక ఈ పెళ్ళికి సంబంధించిన పనులన్ని ఆర్య 12 ఏళ్ల కూతురు రోయా చూసుకుంది. తన తల్లిని మండపం వద్దకు స్వయంగా తీసుకొచ్చి తాళి కట్టే సమయంలో పక్కనే ఉంది. ఈ పెళ్ళికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా చర్చిస్తున్నారు. మరికొందరు మాత్రం కాంగ్రాట్స్ చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఖైరతాబాద్‌ గణపతిని చూశారా?వీడియో

తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో

కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్‌ వీడియో