ప్రపంచంలోనే అత్యంత పొట్టి బర్రె మనదే.. గిన్నిస్‌లోకి 3 అడుగుల రాధ

Updated on: Dec 11, 2025 | 1:34 PM

మహారాష్ట్రకు చెందిన ‘రాధ’ అనే బర్రె ప్రపంచంలోనే అత్యంత పొట్టి గేదెగా గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. సాధారణంగా 4-6 అడుగులు ఉండే బర్రెలకు భిన్నంగా, రాధ కేవలం 3 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. మరుగుజ్జు దూడగా భావించిన దీనిని గిన్నిస్ అధికారులు పరిశీలించి రికార్డు నమోదు చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రదర్శనలకు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సాధారణంగా ఆవులు, బర్రెలు 4 నుంచి 6 అడుగుల ఎత్తు ఉంటాయి. కానీ.. మహారాష్ట్రలోని ఓ బర్రె ఎత్తు కేవలం 3 అడుగులు మాత్రమే. మనుషుల్లో మరుగుజ్జులున్నట్లు.. పశువుల్లోనూ అలాంటి పశువులు ఉంటాయి. కేవలం మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న ఈ గేదె ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తున్న గేదెగా గిన్నివరల్డ్‌ రికార్డ్స్ ‌కి ఎక్కింది. మహారాష్ట్రలోని బొరాటే ప్రాంతానికి చెందిన ఓ రైతు ఇంట పుట్టింది ఈ బర్రె. పుట్టినప్పుడు భలే ముద్దుగా ఉండటంతో ఆ రైతు..దీనికి రాధ అనే పేరు పెట్టి ప్రేమగా పెంచాడు. ఆ దూడ పెరిగి పెద్దదయ్యే క్రమంలో దాని శరీరంలో మార్పులు వచ్చాయి. 85 సెంటీ మీటర్లు ఎత్తు పెరిగిన తర్వాత దాని ఎదుగుదల ఆగిపోయింది. అయితే.. అది మంచి ఆరోగ్యంగా ఉండటంతో దానిని మరుగుజ్జు దూడగా భావించారు. అయితే ఎవరో దీని గురించి గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్స్ వారికి చెప్పటంతో వారొచ్చి.. ఈ చిట్టి గేదెను పరిశీలించి ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తున్న గేదె.. అంటూ తమ రికార్డుల్లో దాని వివరాలు నమోదు చేశారు. నాటి నుంచి అది అందరి దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయంగా పలు ప్రదర్శనలకు ‘రాధ’ చీఫ్‌ గెస్ట్‌గా హాజరవుతున్నది. థాయిలాండ్‌కు చెందిన ‘కింగ్‌ కాంగ్‌’ 6 అడుగుల ఎత్తుతో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన బర్రెగా నిలిచింది. దీంతో పోల్చితే ‘రాధ’ దాదాపు 3 అడుగులు చిన్నది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయులు ధర్నా.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతది

ఆవు పాలు తాగి… ఆస్పత్రికి క్యూకట్టిన జనం.. ఏం జరిగిందంటే

ఇస్రో యువ శాస్త్రవేత్తగా కోనసీమ కుర్రాడు

లంచగొండులకు తగిన గుణపాఠం.. వాళ్ళతో పోలుస్తూ.. వినూత్న ర్యాలీ

డ్రీమర్స్‌కు గ్రీన్‌కార్డు! చిన్న పిల్లలుగా వలస వెళ్లిన వారికి శుభవార్త!