పురుషుడిగా మారి బిడ్డకు జన్మనిచ్చిన కానిస్టేబుల్
పురుషుడుగా మారిన ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ తాజాగా తండ్రి అయ్యారు. జనవరి 15న అతని భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. బిడ్ జిల్లా మజల్‌గావ్ తాలూకాలోని రాజేగావ్‌కు చెందిన లలిత్ కుమార్ సాల్వే 1988లో పుట్టారు. 2010లో మహిళా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అయితే, 2013లో 25 ఏళ్ల వయసులో తన శరీరంలో వస్తున్న మార్పులను గమనించి లలితా సాల్వే వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
పురుషుడుగా మారిన ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ తాజాగా తండ్రి అయ్యారు. జనవరి 15న అతని భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. బిడ్ జిల్లా మజల్‌గావ్ తాలూకాలోని రాజేగావ్‌కు చెందిన లలిత్ కుమార్ సాల్వే 1988లో పుట్టారు. 2010లో మహిళా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అయితే, 2013లో 25 ఏళ్ల వయసులో తన శరీరంలో వస్తున్న మార్పులను గమనించి లలితా సాల్వే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమెలో పురుషుల్లో ఉండే Y క్రోమోజోమ్ లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పురుషులు X, Y సెక్స్ క్రోమోజోమ్‌లను కలిగి ఉంటే, స్త్రీలు రెండు X క్రోమోజోమ్‌లను కలిగి ఉంటారు. అప్పుడు సాల్వేకు జెండర్ డిస్ఫోరియా ఉందని, లింగమార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీంతో లింగమార్పిడి కోసం నెల రోజుల సెలవు కావాలంటూ లలిత 2017లో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. గ్రీన్ సిగ్నల్ రావడంతో 2018 నుంచి 2020 వరకు పలు దఫాలుగా జరిగిన సర్జరీల ద్వారా ఆమె పురుషుడిగా మారి తన పేరును లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
4 గంటల్లో టైపు రైటర్‌పై రూపుదిద్దుకున్న శ్రీరాముడు
అయోధ్య తరహాలోనే మరో రామాలయం.. ఎక్కడో తెలుసా ??
ఏటా శ్రీరామ నవమి నాడు బాల రాముడిని ముద్దాడనున్న సూర్యుడు..