గుడికి వెళ్లి వస్తుంటే.. రోడ్డుపై దొరికిన డబ్బు సంచి..

Updated on: Oct 31, 2025 | 12:00 PM

రోడ్డుపై రూపాయి బిళ్ల దొరికితేనే గుట్టు చప్పుడుకాకుండా జేబులో వేసుకుని వెళ్లిపోయే రోజులివి. అలాంటిది ఓ మహిళ రోడ్డుపై దొరికిన లక్షల రూపాయల నగదును పోలీసులకు అప్పగించింది. తమిళనాడులోని మధురైలో ఈ ఘటన జరిగింది. నగరంలో సోమవారం ఓ మహిళ వీధిలో పడి ఉన్న రూ.17.5 లక్షల నగదు ఉన్న సంచిని గుర్తించి పోలీసులకు అప్పగించింది.

సెల్వ మాలిని అనే 47 ఏళ్ల మహిళ సోమవారం ఆది చొక్కనాథర్ ఆలయాన్ని సందర్శించి ఇంటికి వెళుతుండగా.. వక్కిల్ న్యూ స్ట్రీట్‌లో ఆమెకు ఓ సంచి కనిపించింది. బ్యాగు లోపల అన్నీ నోట్ల కట్టలే. ఎవరికైనా డబ్బు దొరికితే గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి తీసుకెళ్తారు. కానీ సెల్వమాలిని మాత్రం ఆ బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఆమె ముందే బ్యాగును తెరిచి నోట్ల కట్టలను లెక్కించిన పోలీసులు మొత్తం రూ.17.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు.బ్యాగులోని నోట్ల కట్టలను చూసి ఎలాంటి ప్రలోభానికి గురికాకుండా.. ఆమె భద్రంగా తీసుకొచ్చి తమకు అప్పజెప్పటంతో ఆమె నిజాయతీని పోలీసులు అభినందించారు. ఆ డబ్బును యజమానికి అప్పగిస్తే తాను సంతోషిస్తానని, తాను కష్టాల్లో ఉన్నా.. పరుల సొమ్మును ఆశించనని ఆమె చెప్పటంతో స్టేషన్ సిబ్బంది ముగ్ధులయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. మధురై సిమ్మక్కల్‌ ప్రాంతానికి చెందిన సెల్వమాలిని అనే మహిళ మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సెల్వమాలిని ఆలయం నుంచి ఇంటికి వెళుతుండగా రోడ్డుపై ఓ సంచీ కనిపించింది. రోడ్డుకు అడ్డంగా పడిన ఆ సంచిని తీసి పక్కన పడేద్దామని దానిని పట్టుకున్న ఆమెకు అందులో నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో సమీపంలో భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆ సంచీని తీసుకెళ్లి అప్పగించింది. కాగా, ఆ నోట్ల కట్టల బ్యాగు ఎవరిది.. అక్కడ ఎందుకు ఉందనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. డబ్బు యజమానిని గుర్తించడానికి వారు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘అజ్మల్ అమ్మాయిలను వేధిస్తాడు.. నన్ను కూడా ..’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

శిరీష్‌ ఎంగేజ్‌మెంట్‌పై వర్షం దెబ్బ.. ఆగమైన ఏర్పాట్లు..! శిరీష్‌ ఎమోషనల్

రీతూ గేమ్ క్లోజ్ ఇక !! పవన్ తో మాధురి నయా స్ట్రాటజీ

TOP 9 ET News: కమల్–రజనీ వద్దనుకున్న సినిమా పవన్-ప్రభాస్ తో

అందరూ అదే చేస్తే.. బాబుకు షాకిచ్చిన గోదావరి బుడ్డోడు