M87 galaxy Black Hole: M87 కృష్ణబిలం అచ్చు భూమిలా గిరగిరా తిరుగుతోంది..!
కృష్ణ బిలాల అధ్యయనంలో కీలక విషయం బయటపడింది. గెలాక్సీ ఎం87లో ఉన్న అతి భారీ కృష్ణబిలం ఒకటి భూమిలా వర్తులాకారంలో గిరగిరా తిరుగుతోంది. ఇది మనకు 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. రెండు దశాబ్దాల పాటు సేకరించిన డేటాను అధ్యయనం చేసిన సైంటిస్టులు ఈ విషయాన్ని బయటపెట్టారు. నాలుగేళ్ల క్రితం ఈవెంట్ హోరైజాన్ టెలీస్కోప్ తీసిన ఫొటోను అధ్యయనం చేసి, అది నిలువుగానూ, పక్కకూ గిరగిరా తిరుగుతోందని తేల్చారు.
కృష్ణ బిలాల అధ్యయనంలో కీలక విషయం బయటపడింది. గెలాక్సీ ఎం87లో ఉన్న అతి భారీ కృష్ణబిలం ఒకటి భూమిలా వర్తులాకారంలో గిరగిరా తిరుగుతోంది. ఇది మనకు 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. రెండు దశాబ్దాల పాటు సేకరించిన డేటాను అధ్యయనం చేసిన సైంటిస్టులు ఈ విషయాన్ని బయటపెట్టారు. నాలుగేళ్ల క్రితం ఈవెంట్ హోరైజాన్ టెలీస్కోప్ తీసిన ఫొటోను అధ్యయనం చేసి, అది నిలువుగానూ, పక్కకూ గిరగిరా తిరుగుతోందని తేల్చారు. ఇలా తేలడం ఇదే మొదటిసారి. కృష్ణ బిలాల అధ్యయనంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 45 అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధకుల బృందం నాలుగేళ్ల పాటు ఈ అంశంపై లోతుగా పరిశోధించారు. ఇది అచ్చం సౌర వ్యవస్థలోని గురుత్వాకర్షణ బలాల కలయిక తదితరాల ప్రభావంతో భూమి భ్రమణం, పరిభ్రమణం చేస్తున్న తీరును పోలి ఉందట. ఈ సరికొత్త సమాచారం చాలా థ్రిల్లింగ్ గా ఉందని దీనిపై సమర్పించిన అధ్యయన పత్రానికి లీడ్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ యుజూ కుయ్ చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..