ఆన్‌లైన్‌లో రూ.4 కోట్ల వాచ్‌ ఆర్డర్‌ చేశాడు.. డెలివరీ వచ్చింది చూసి

Updated on: Oct 27, 2025 | 3:22 PM

ప్రస్తుత కాలంలో అన్నీ ఆన్‌లైన్‌లోనే.. ఒక్క రూపాయి నుంచి కోట్ల విలువైన లావాదేవీలు కూడా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. కాలు కదపకుండా కోరినవన్నీ ఒక్క క్షణంలో కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. దీనివల్ల సమయంతోపాటు, ఎంతోకొంత డబ్బు కూడా ఆదా అవుతుండటంతో ఎక్కువగా ఆన్‌లైన్‌ షాపింగ్‌కే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు జనాలు.

అయితే ఈ ఆన్‌లైన్‌ షాపింగ్స్‌ కస్టమర్స్‌కి ఒక్కోసారి ఊహించని షాకిస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో కోట్ల విలువైన వాచ్‌ని ఆర్డర్‌ చేశాడు. అయితే డెలివరీ అయిన వస్తువును చూసి అతను షాక్‌ తిన్నాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. చెన్నైకి చెందిన ఓ ప్రముఖ వస్త్రదుకాణం యజమాని కుమారుడు ఇటీవల ఓ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో రూ.4 కోట్ల విలువైన చేతి గడియారాన్ని చూశాడు. అది అతనికి చాలాబాగా నచ్చింది. దాంతో దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఏజెంట్‌ను సంప్రదించి, ఆ వాచ్ కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాడు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఆ వాచ్ కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో రూ.2.3 కోట్లు చెల్లించాడు. మంగళవారం అతడికి ఆ వాచ్ పార్శిల్ అందింది. ఎంతో ఆత్రుతతో పార్శిల్ విప్పి చూసిన అతను ఒక్కసారిగా షాకయ్యాడు. అందులో కేవలం రూ.400 విలువైన చౌకబారు వాచ్ ఉండటాన్ని చూసి నివ్వెరపోయాడు. తాను మోసపోయానని గ్రహించి, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ భారీ మోసంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న ఏజెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అడ్వాన్స్‌గా చెల్లించిన రూ. 2.30 కోట్లు తిరిగి ఇప్పించాలని బాధితుడు పోలీసులను కోరాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాతి వైరం మరచి.. పసికూనల ఆకలి తీర్చి

చూసి తీరాల్సిన రిచ్ కంట్రీ ఏడుగురే ఖైదీలు.. వంద మంది పోలీసులు

ఇంట్లో కర్పూరంతో ఇలా చేయండి.. ఫలితం మీరే చూడండి

దేవుడి ప్రసాదాన్ని దొంగిలిస్తారు.. ఎక్కడంటే

క్రెడిట్‌ స్కోర్‌ ఎంతకీ పెరగట్లేదా ?? ఈ తప్పులు చేస్తున్నారేమో చూడండి