రైతుకు దొరికిన వజ్రం.. దీని ధర ఎంతో తెలుసా ??

మధ్యప్రదేశ్‌లో ఓ రైతుకు అదృష్టం కలిసివచ్చింది. ఒక్క రోజులో అతని ఫేట్ మారిపోయింది. లక్షలకు అధిపతి అయిపోయాడు. పన్నాలో సదరు రైతు ఓ చిన్న గనిని లీజుకు తీసుకున్నాడు.

Phani CH

|

May 13, 2022 | 9:08 AMమధ్యప్రదేశ్‌లో ఓ రైతుకు అదృష్టం కలిసివచ్చింది. ఒక్క రోజులో అతని ఫేట్ మారిపోయింది. లక్షలకు అధిపతి అయిపోయాడు. పన్నాలో సదరు రైతు ఓ చిన్న గనిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ అతడికి 11.88 క్యారెట్ల నాణ్యమైన వజ్రం దొరికింది. జిల్లాలోని పట్టి ప్రాంతంలోని ఒక గనిలో కూలీగా పనిచేస్తున్న ప్రతాప్ సింగ్ యాదవ్.. ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు వజ్రాల అధికారి రవి పటేల్ మీడియాకు తెలిపారు. నాణ్యమైన ఈ వజ్రాన్ని త్వరలో జరగనున్న వేలంలో అమ్మకానికి ఉంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధరను నిర్ణయిస్తామని వెల్లడించారు. నేను తక్కువ వ్యవసాయ భూమి ఉన్న పేదవాడిని, బయట కూలి పని కూడా చేస్తున్నాను. గత మూడు నెలలుగా ఈ గనిలో కష్టపడి ఈ వజ్రాన్ని కనుగొనగలిగాను. డైమండ్ వర్క్‌ప్లేస్‌లో వేలం ద్వారా వచ్చిన డబ్బుతో వ్యాపారాన్ని ప్రారంభిస్తానని తెలిపాడు ప్రతాప్‌ సింగ్‌ యాదవ్‌. పిల్లల చదువుల కోసం మరికొంత వినియోగిస్తానని అన్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైతుకు దొరికిన వజ్రం.. దీని ధర ఎంతో తెలుసా ??

Sarkaru Vaari Paata: ఆన్‌లైన్‌లో సర్కారు వారి పాట ఫుల్‌ మూవీ.. ప్రీగా..!!

థియేటర్‌ను ఊపేస్తున్న నాటీ డైలాగ్.. ఇది కదా మహేష్ నుంచి కోరుకునేది !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu