Gas Cylinder Price: పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?

|

Aug 03, 2024 | 9:48 PM

ఎప్పటిలాగానే ఈ నెల కూడా చమురు కంపెనీలు గ్యాస్‌ ధరలను సవరించాయి. కొత్తనెల ఆగస్టు ప్రారంభమవడంతో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 8.50 మేర స్వల్పంగా పెంచాయి. సవరించిన ధర ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చాయని కంపెనీలు స్పష్టం చేశాయి. సవరించిన ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.6.50 పైసలు మేర పెరిగి రూ. 1652.50కు చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్ డేటా పేర్కొంది.

ఎప్పటిలాగానే ఈ నెల కూడా చమురు కంపెనీలు గ్యాస్‌ ధరలను సవరించాయి. కొత్తనెల ఆగస్టు ప్రారంభమవడంతో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 8.50 మేర స్వల్పంగా పెంచాయి. సవరించిన ధర ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చాయని కంపెనీలు స్పష్టం చేశాయి. సవరించిన ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.6.50 పైసలు మేర పెరిగి రూ. 1652.50కు చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్ డేటా పేర్కొంది. కోల్‌కతాలో రూ.8.50 పైసలు మేర పెరిగి రూ.1764.50 పైసలకు చేరింది. సవరించిన ధరల ప్రకారం ప్రస్తుతం 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ముంబైలో రూ.1605లు, చెన్నైలో రూ.1817లు గా ఉన్నాయి. రాష్ట్రాల బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. కాగా, 14 కేజీల గృహవినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులేదు. ధరలు యథాతథంగా ఉంటాయని కంపెనీలు తెలిపాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on