సిలిండర్ నుంచి ఊడిన గ్యాస్ పైప్ అంతలోనే ఘోరం వీడియో
ముంబయిలోని ఓ ఇంట్లో భయానక ఘటన జరిగింది. ఓ మహిళ తమ ఇంట్లో గ్యాస్‌స్టౌవ్‌కు సిలిండర్ బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ పైప్ ఊడిపోయింది. దానిని తిరిగి పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ పైపులో నుంచి గ్యాస్ రావడంతో సాధ్యం కాలేదు. దీంతో సిలిండర్‌ను కిచెన్‌లో నుంచి బయటకు తెచ్చి హాల్‌లో పడేసిన ఆ మహిళ భయంతో బయటకు పరుగులు తీసింది. సిలిండర్ కిందపడి ఉండడంతో పైప్ నుంచి లీక్ అయిన గ్యాస్ ఇల్లంతా వ్యాపించింది.
కొన్ని క్షణాలకు గ్యాస్ రావడం ఆగిపోవడంతో ఇంట్లోకి వచ్చిన ఆ మహిళ మరో వ్యక్తి సహాయంతో సిలిండర్‌ను అక్కడి నుంచి తీయడానికి ప్రయత్నించింది.అంతలోనే క్షణాల్లో పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. తెరిచి ఉన్న రెండు తలుపుల నుంచి వెంటనే వారిద్దరూ ఒక్క ఉదుటన బయటకు పారిపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వారి ఇంట్లోని హాలులో ఉన్న సీసీ కెమెరాలో ఈ భయానక దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన ముంబయిలో జరిగినట్లు పలు జాతీయ మీడియా వర్గాలు బయటపెట్టినప్పటికీ.. కచ్చితమైన ప్రాంతం మాత్రం తెలియరాలేదు. వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం జూన్ 18వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘అదృష్టవశాత్తూ ఆ ఇంటికి ఉన్న రెండు తలుపులు, కిటికీలు తెరిచి ఉండడంతో లీకైన గ్యాస్ బయటకు వెళ్లడంతో ప్రమాద తీవ్రత తగ్గింది’ అని రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
భార్య ముక్కు కొరికేసిన భర్త.. అందంగా ఉందని కాదు వీడియో
చీర కట్టినా..చివరికి దొరికిపోయాడు వీడియో
రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి..దానిపైనే కునుకేసిన వ్యక్తి ! ఎక్కడంటే వీడియో
EPFO గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఆ సేవలు
స్మార్ట్ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న ధరలు!
టైగర్ సఫారీలో జీప్లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
