AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Ram non-vegetarian: శ్రీరాముడు నాన్ వెజిటేరియన్.! NCP నేత వ్యాఖ్యలపై దుమారం!

Lord Ram non-vegetarian: శ్రీరాముడు నాన్ వెజిటేరియన్.! NCP నేత వ్యాఖ్యలపై దుమారం!

Anil kumar poka
|

Updated on: Jan 09, 2024 | 9:21 AM

Share

కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తి భావంతో కొలుచుకునే శ్రీరాముడిని ఉద్దేశించి ఎన్సీపీ నేత జితేంద్ర అవద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు శాకాహారి కాదని, ఆయన వేటాడి మాంసాన్ని తినేవారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని షిరిడీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడు జంతువులను వేటాడి తినేవాడనీ అవద్‌ అన్నారు. రాముడిని ఉదాహరణగా చూపి ప్రతి ఒక్కరినీ శాకాహారులుగా మార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ..

కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తి భావంతో కొలుచుకునే శ్రీరాముడిని ఉద్దేశించి ఎన్సీపీ నేత జితేంద్ర అవద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు శాకాహారి కాదని, ఆయన వేటాడి మాంసాన్ని తినేవారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని షిరిడీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడు జంతువులను వేటాడి తినేవాడనీ అవద్‌ అన్నారు. రాముడిని ఉదాహరణగా చూపి ప్రతి ఒక్కరినీ శాకాహారులుగా మార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ.. కానీ, శ్రీరాముడు మాంసాహారి అని చెప్పుకొచ్చారు. 14 ఏళ్లు అడవుల్లో గడిపిన రాముడు.. వెజిటేరియన్‌ కోసం ఎక్కడికి వెళ్తాడు? అవునా..? కాదా..? తాను చెప్పినదానికి పూర్తిగా కట్టుబడి ఉన్నా అంటూ వ్యాఖ్యానించారు. అవద్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అవద్‌పై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రామ భక్తులు, బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మేరకు ఎన్సీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో దిగివచ్చిన అవద్‌ క్షమాపణలు కోరారు. ఏ విషయం గురించీ తాను తొందరపడి మాట్లాడనని, రామాయణంలో ఉన్నదే చెప్పానంటూ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని వేడుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.