Monkey Funny Video: టెడ్డీ బేర్ చూసి భయంతో వణికిపోయిన కోతి.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వడం ఖాయం..

|

Feb 13, 2022 | 8:44 AM

సాధారణంగా కోతులు చేసే అల్లరి చేష్టలు నవ్వులు తెప్పిస్తాయి. అప్పుడప్పుడూ వాటి చేష్టలతో ఇతర జంతువులను, మనుషులను కూడా భయపెడతూ ఉంటాయి. అయితే జంతువులను.. మనుషులను చూసి బయటపడని కోతి… ఓ చిన్న టెడ్డీ బేర్‏ను చూసి భయంతో పారిపోయింది...


సాధారణంగా కోతులు చేసే అల్లరి చేష్టలు నవ్వులు తెప్పిస్తాయి. అప్పుడప్పుడూ వాటి చేష్టలతో ఇతర జంతువులను, మనుషులను కూడా భయపెడతూ ఉంటాయి.అయితే జంతువులను.. మనుషులను చూసి బయటపడని కోతి… ఓ చిన్న టెడ్డీ బేర్‏ను చూసి భయంతో పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మీరు కడుపుబ్బ నవ్వడం మాత్రం ఖాయం. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపై ఆగి ఉన్న కార్లపై నుంచి ఓ కోతి గెంతుతూ తెగ ఎంజాయ్ చేస్తుంది. అలా గెంతుతూ.. గెంతుతూ . ఓ కార్ సైడ్ గ్లాస్ పైకి వచ్చి కూర్చుంది. ఈ కోతిని చూసి ఆ కారులో ఉన్న చిన్నారి భయపడ్డాడు. దానిని కారుపైనుంచి దిగమని బెదిరించాడు కూడా.. అయినా అది దిగలేదు దాంతో ఆ చిన్నారి తన దగ్గర ఉన్న టెడ్డీ బేర్ బొమ్మను ఆ కోతికి చూపించాడు. దాన్ని చూసి భయపడిన కోతి దెబ్బకు కారు మీదనుంచి దూకి పరుగు లంకించుకుంది. ఈఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.