పర్యాటకులను ఆకట్టుకుంటున్న సెల్ఫీ బ్రిడ్జి.. ఎక్కడ నిర్మించారో తెలుసా ??
జనం ప్రయాణ ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం అందమైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఈ రాకపోకలతో పాటు పర్యాటకులను ఆకర్షిస్తూ.. సెల్పీ బ్రిడ్జిగా మారిపోయింది. జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా మయూరాక్షి నదిపై అతి పొడవైన వంతెన పూర్తయింది. ఈ వంతెన... మసాలియా బ్లాక్‌లోని మక్రంపూర్‌నీ..
జనం ప్రయాణ ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం అందమైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఈ రాకపోకలతో పాటు పర్యాటకులను ఆకర్షిస్తూ.. సెల్పీ బ్రిడ్జిగా మారిపోయింది. జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా మయూరాక్షి నదిపై అతి పొడవైన వంతెన పూర్తయింది. ఈ వంతెన… మసాలియా బ్లాక్‌లోని మక్రంపూర్‌నీ.. దుమ్కా సదర్ బ్లాక్‌లోని కుమ్రాబాద్‌ని కలుపుతోంది. ఈ వంతెన నిర్మాణంతో 15 కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. 2,340 మీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణానికి 198 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఈ వంతెన నిర్మాణం ఆకర్షణీయంగా సాగింది. దీన్ని చూసి ప్రజలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. దాంతో దీన్ని సెల్ఫీ బ్రిడ్జిగా మారిపోయింది. త్వరలోనే ప్రారంభించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. దుమ్కా నగరానికి దగ్గర్లో చాలా గ్రామాలు మయూరాక్షి నదికి ఇరువైపులా ఉన్నాయి. అక్కడి ప్రజలు దుమ్కాకి రావాలంటే పడవలను ఆశ్రయించాల్సిందే. ఈ వంతెన నిర్మాణంతో మసాలియాలోని మక్రంపూర్… దుమ్కాలోని మస్సంజోర్‌ని చేరుకోవడానికి మార్గం సుగమం అయ్యింది. ఇదవరకటిలాగా పడవలో వెళ్లాల్సిన అవసరం లేదు.