Brahma kamalam: వికసించిన అరుదైన పుష్పం.. రాత్రిపూటఒక్కసారిగా ఆ ప్రాంతమంతా వెదజల్లిన పరిమళం..
నారాయణపేటలో అరుదైన బ్రహ్మకమలం పుష్పం వికసించింది. శాతావాహన కాలనీకి చెందిన వెంకటేశ్వరమ్మ ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో బ్రహ్మకమలం పుష్పం వికసించింది.
నారాయణపేటలో అరుదైన బ్రహ్మకమలం పుష్పం వికసించింది. శాతావాహన కాలనీకి చెందిన వెంకటేశ్వరమ్మ ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో బ్రహ్మకమలం పుష్పం వికసించింది. ఆ ప్రాంతమంతా సువాసన వెదజల్లింది. రెండేళ్ల కిందట బ్రహ్మకమలం మొక్క నాటారు వెంకటేశ్వరమ్మ. ఇక అప్పటినుంచి ఆమొక్క ఎప్పుడు పూలు పూస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. చివరకు పవిత్రమైన బ్రహ్మకమలం వికసించడంతో.. కాలనీవాసులంతా వెంకటేశ్వరమ్మ ఇంటికి చేరుకొని పూజలు చేశారు. బ్రహ్మకమలం పుష్పంపై సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉంటారని నమ్ముతారు. మాములుగా అయితే హిమాలయాల్లో ఈ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. హైందవ సాంప్రదాయంలో బ్రహ్మకమలం పుష్పానికి చాలా విశిష్ఠత ఉందని పండితులు చెబుతారు. బ్రహ్మ కూర్చునే పువ్వు అని చెబుతుంటారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే పూసి… కొన్ని గంటలు మాత్రమే ఈ పుష్పాలు వికసించి ఉంటాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos