పాపం చిరుతకు ఎక్కడ దాక్కువాలో తెలియక.. ఏకంగా అక్కడ దాక్కుంది

Updated on: Apr 09, 2025 | 4:47 PM

కారణమేదైనా అడవి జంతువులు తరచూ జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆహారం వెతుక్కుంటూ అడవులను వీడి గ్రామాలు, నగరాల్లోకి చొరబడుతున్నాయి. ఈ క్రమంలో అవి ప్రమాదాలకు గురవడమే కాకుండా జనాలపై దాడులకు పాల్పడుతున్నాయి. మొన్నటి వరకూ పొలాల్లోనో, గ్రామ శివార్లలో పశువుల కొట్టాల్లోనో సంచరిస్తూ పశువులను చంపి తినేవి.

ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకి చొరబడుతున్నాయి. తాజాగా బెంగళూరులో ఓ చిరుత ఓ ఇంట్లో ప్రవేశించి మూలన నక్కింది. అది చూసి ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు ఆ ఇంటివారు. బెంగళూరు శివారులో ఓ ఇంట్లో చిరుత దూరింది. ఇంట్లో ఓ మూలన నక్కిన ఆ చిరుతను చూసి గజగజా వణికిపోయింది ఆ కుటుంబం. వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలిసి చుట్టుపక్కల వారు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు, సిబ్బంది చిరుతను బంధించేందుకు తీవ్రంగా శ్రమించారు. దానిని పట్టుకోబోయిన అటవీ సిబ్బందిని ఐదు గంటలపాటు ముప్పుతిప్పలు పెట్టింది ఆ చిరుత. చివరకు మత్తు ఇంజెక్షన్‌ ఇవ్వడంతో అటవీ సిబ్బందికి చిక్కక తప్పలేదు ఆ చిరుతకు. అలా సురక్షితంగా చిరుతను బంధించి అక్కడినుంచి తీసుకెళ్లారు అటవీ అధికారులు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏ సమయంలో ఏ జంతువు ఇంట్లో చొరబడుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లోను కట్టలేదని రంగంలోకి బ్యాంక్‌ మేనేజర్‌.. వచ్చి ఏకంగా దాన్నే ఎత్తుకుపోయారు

dilsukhnagar bomb blast: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??