Leopad attack: ఏకంగా ఊరు మొత్తాన్నే వణికించేసింది.. అడ్డొచ్చిన వారందరిపై ఎటాక్ చేస్తూ.. దిమ్మతిరిగే వీడియో..

Updated on: Aug 14, 2022 | 8:56 PM

అడవిలో వివిధ రకాల జంతువులు నివాసముంటాయి. వీటిలో సింహాలు, పులులు, చిరుతలు వంటివి క్రూర జంతువులు. వీటికి చిక్కితే ఎవరైనా సరే తప్పించుకోవడం కష్టం.


అడవిలో వివిధ రకాల జంతువులు నివాసముంటాయి. వీటిలో సింహాలు, పులులు, చిరుతలు వంటివి క్రూర జంతువులు. వీటికి చిక్కితే ఎవరైనా సరే తప్పించుకోవడం కష్టం. వేట, వేగం విషయంలో చిరుతపులులతో ఏ జంతువూ పోటీ పడలేదు. ఇలాంటి జంతువులు అడవుల్లోనే నివాసముంటున్నప్పటికీ.. ఒక్కోసారి అవి జనావాసాల్లోకి వస్తుంటాయి. అంతే కాకుండా జనాలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ చిరుత దారి తప్పి గ్రామంలోకి వచ్చింది. దానిని చూసి భయపడిపోతున్న గ్రామస్థులపై దాడి చేసింది. చిరుత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి గోడ ఎక్కుతున్న సమయంలో అతనిపై దాడి చేసి అక్కడి నుంచి ఉడాయించింది. అలా అడ్డొచ్చిన కొందరిపై దాడి చేసుకుంటూ చిరుత అక్కడినుంచి పారిపోయింది. అయితే ఆ దాడిలో ఎవరూ గాయపడకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ షాకింగ్ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ 35 సెకన్ల వీడియోను వేలాదిమంది వీక్షిస్తూ.. లైక్స్‌తో ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 14, 2022 08:56 PM