Big Family In India: దేశంలోనే పెద్ద ఫ్యామిలీ.. ఎకరం భూమిలో ఇల్లు.. ఒకే కిచెన్ లో వంట.. అమ్మబాబోయ్..
బీహార్‌లోని గయా జిల్లాలో ఓ కుటుంబంలో ఏకంగా నాలుగు తరాలవారు కలిసి జీవిస్తున్నారు. 62 మంది కుటుంబ సభ్యులతో, ఐక్యతకు మారు పేరుగా నిలుస్తుందీ కుటుంబం. వీరంతా ఉమ్మడి కుటుంబానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
బీహార్‌లోని గయా జిల్లాలో ఓ కుటుంబంలో ఏకంగా నాలుగు తరాలవారు కలిసి జీవిస్తున్నారు. 62 మంది కుటుంబ సభ్యులతో, ఐక్యతకు మారు పేరుగా నిలుస్తుందీ కుటుంబం. వీరంతా ఉమ్మడి కుటుంబానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతమందికీ ఒకే వంటగదిలో భోజనం తయారు చేసి అందరూ కలిసి తింటారు. అంతేకాదు సామాజిక సేవలోనూ ఈ కుటుంబం ముందుంటుంది. బోధ్‌గయలో సామాజిక సేవకు ఉదాహరణగా నిలిచిన ‘కళ్యాణ్ కుటుంబం’ ఇతరులకు అనేక విషయాల్లో స్ఫూర్తిగా నిలిస్తోంది. సాధారణంగా ఇంట్లో నలుగురు, ఐదుగురు సభ్యులుంటేనే.. కలహాలతో నిండిపోతుంది. ఈ కుటుంబ పెద్దలు కృష్ణ కన్నయ్య ప్రసాద్, రాధికా దేవి దంపతులు కుటుంబం మొత్తాన్ని ఐక్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్రను పోషిస్తారు. ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో 57 గదులతో ఇంటి నిర్మించి, ‘కళ్యాణ్ పరివార్ కాంప్లెక్స్’ గా దానికి పేరుపెట్టారు. ఆ ఇంటిలో 62 మంది కలిసి ఒకేసారి భోజనం చేస్తారు. ఈ ఉమ్మడి కుటుంబంలో 9 మంది అన్నదమ్ములు ఉన్నారు. వీరందరికీ స్వంత వ్యాపారాలున్నాయి. ఇక NGOల ద్వారా ఆ ప్రాంతంలోని పేదలు, నిస్సహాయులు, నిరుపేదలకు సేవ చేయడంలో బోధ్‌గయాలో కళ్యాణ్ పరివార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం, స్వావలంబన తదితర సేవలను ఐదు వేర్వేరు స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలకు అందిస్తున్నారు.ఈ కుటుంబంలో కృష్ణ కన్నయ్య ప్రసాద్‌కు 75 ఏళ్లు కాగా, ఆ కుటుంబంలో చిన్నవాడైన చిమి కళ్యాణ్ వయసు 10 నెలలే. ఇంట్లో మొత్తం 21 మంది పిల్లలు ఉన్నారని వెల్లడించారు. ఉమ్మడి కుటుంబంగానే కాకుండా ఈ ఫామిలీకి స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ ఇంట్లో 12 జంటలు ఉన్నారు. ఈ ఉమ్మడి కుటుంబం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!