రైలు నుంచి పడి భర్త మృతి.. 23 ఏళ్ల తర్వాత ఆమెకు పరిహారం

Updated on: Oct 25, 2025 | 10:33 AM

సుప్రీం కోర్టు చొరవ తీసుకుని మహిళను వెతికించి మరీ పరిహారం ఇప్పించిన ఘటన ఇది. రైలు ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళకు 23 ఏళ్ల తర్వాత పరిహారం అందింది. భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. విజయ్‌ సింగ్‌ అనే వ్యక్తి 2002లో భాగల్పూర్‌–దానాపూర్‌ రైలులో ప్రయాణిస్తూ రద్దీ కారణంగా కంపార్టుమెంట్‌ నుంచి హఠాత్తుగా స్టేషన్‌పైకి జారిపడ్డారు.

తీవ్రంగా గాయపడి మృతి చెందారు. పరిహారం కోసం ఆయన భార్య సంయుక్త దేవి న్యాయ పోరాటం ప్రారంభించారు. కాగా, విజయ్ సింగ్‌కు మతి స్థిమితం లేదని, అతడిని ఎవరో రైలు నుంచి తోసేశారని, పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్, పాట్నా హైకోర్టు తేల్చిచెప్పాయి. దాంతో ఆయన భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఆదేశాలను 2023లో సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ కొనసాగించింది. విజయ్‌ సింగ్‌కు మతిస్థిమితం లేకపోతే రైలు టికెట్‌ ఎలా కొనుగోలు చేశాడని, రైలు ఎలా ఎక్కాడని ప్రశ్నించింది. అసంబద్ధమైన కారణాలతో పరిహారాన్ని తిరస్కరించడం సరైంది కాదని తేల్చిచెప్పింది. బాధితురాలు సంయుక్త దేవికి రూ.4 లక్షల పరిహారాన్ని ఏటా 6 శాతం వడ్డీతో కలిపి రెండు నెలల్లోగా చెల్లించాలని రైల్వేశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ పరిహారం అందజేయడానికి సంయుక్తి దేవి చిరునామా లేదు. ఆమె ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు. సంయుక్తి దేవి కోసం పబ్లిక్‌ నోటీసు జారీ చేయాలని, మీడియాలో ప్రకటన ఇవ్వాలని సుప్రీం కోర్టు రైల్వే శాఖకు సూచించింది. ఈ ప్రయత్నం ఫలించింది. సంయుక్త దేవి ఆచూకీ లభించింది. పరిహారాన్ని ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీవీ9 పరిశీలనలో బయటపడిన ట్రావెల్స్‌ నిర్లక్ష్యం

కామాంధుడికి 32 ఏళ్ల జైలు శిక్ష..

ఉద్యోగులకు అమెజాన్ ఊహించని షాక్.. 5 లక్షల మంది ఔట్

తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమం

భూమికి రెండో చంద్రుడు !! 2083 వరకు మనతోనే