ప్రేమించుకున్నారు.. ఎంగేజ్‌మెంట్‌ అయింది.. అయినా పెళ్లి కూతురు ఆత్మహత్య

|

Jun 09, 2023 | 9:58 AM

వాళ్లిద్దరూ అయిదు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను ఒప్పించారు. మరికొన్ని రోజులలో పెళ్లి జరుగుతుంది అనగా.. ఇంతలో ఆ అబ్బాయి మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి.. ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు వాసి పద్మావతి .. నందికొట్కూరు పాతకోటకు..

వాళ్లిద్దరూ అయిదు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను ఒప్పించారు. మరికొన్ని రోజులలో పెళ్లి జరుగుతుంది అనగా.. ఇంతలో ఆ అబ్బాయి మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి.. ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు వాసి పద్మావతి .. నందికొట్కూరు పాతకోటకు చెందిన వినోద్​ కుమార్ గత అయిదు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాలను పెళ్లికి ఒప్పించారు. యువతి తల్లిదండ్రులను కూడా ఆ యువకుడు ఒప్పించాడు. తనను ప్రాణంగా ప్రేమించిన అబ్బాయే తన జీవితంలోకి వస్తున్నాడని ఆ యువతి ఎంతో సంతోషపడింది. తనతోనే జీవితాన్ని ఊహించుకుంది. ఈ సంతోష సమయంలో.. మార్చి 9న ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. జూన్‌ 10న పెద్దలు పెళ్లి మూహూర్తం ఫిక్స్ చేశారు. ఇంతలో ఊహించని మలుపు తీసుకుంది. ఒక్క ఫోన్ కాల్..​ ఆ అమ్మాయి కలలను తలకిందులు చేసింది. పోలీసులు ఫోన్ చేసి.. వినోద్ అనే యువకుడికి పెళ్లి అయిపోయిందని.. ఏమైనా సందేహాలు ఉంటే స్టేషన్​కు రావాలని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బస్సును చుట్టుముట్టిన పులులు.. అయినా తగ్గని డ్రైవర్‌

పుట్టిన మూడురోజులకే బోర్లా పడిన శిశువు.. ఆశ్చర్యపోయిన తల్లి, వీడియో రికార్డింగ్‌

విమానంలో కొందరు నగ్నంగా, మరికొందరు బికినీల్లో !! ప్రపంచంలోనే వింత ప్రయాణాలు

‘మంచి ఫిగర్‌’ అని కామెంట్ చేస్తే కటకటాలకే.. బెయిల్ కూడా దొరకదు

ఉడుతా ఇదీ.. దీని వేషాలు మామూలుగా లేవుగా..