Kulhad Chai: వణికించే చలిలో.. పొగలు కక్కే కుల్హాడ్ చాయ్.. రుచి, ఆరోగ్యంలో అమోఘం.. వీడియో.

| Edited By: Ravi Kiran

Jan 17, 2023 | 8:30 AM

శీతాకాలపు ఉదయాలు చాలా మనోహరంగా ఉంటాయి. వణికించే చలితో పాటు.. పొగలు కప్పే టీ, కాఫీలు మనల్ని రా రమ్మని ఊరిస్తూ ఉంటాయి. సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ


శీతాకాలపు ఉదయాలు చాలా మనోహరంగా ఉంటాయి. వణికించే చలితో పాటు.. పొగలు కప్పే టీ, కాఫీలు మనల్ని రా రమ్మని ఊరిస్తూ ఉంటాయి. సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ వేడి వేడి టీ లేదా కాఫీ ని సిప్ చేస్తే ఆ హాయే వేరు. మన దేశంలో టీ రకాలకు కొదవే లేదు. ముఖ్యంగా తందూరీ చాయ్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. వేడిగా పొగలు కక్కుతున్న టీని అంతకంటే వేడిగా ఉన్న మట్టి కుండలో పోసి సర్వ్ చేసిన టీ రుచి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కొన్ని ప్రాంతాల్లో మట్టితో చేసిన కప్పుల్లోనూ టీ అందిస్తుంటారు. దీని వల్ల వినియోగదారులకు మాత్రమే కాకుండా దుకాణ యజమానులకు కూడా ప్రయోజనం. ఎందుకంటే మట్టితో చేసిన కప్పులు పర్యావరణానికి మంచివి. మట్టికప్‌లో చాయ్ తాగడం వల్ల మానసికంగా ఆనందంగా ఉండటమే కాకుండా అద్భుతమైన శారీరక ప్రయోజనాలూ అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పేగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం అంటున్నారు. ఇది ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. ప్లాస్టిక్ కప్పులు లేదా శుభ్రం చేయని గ్లాసుల్లో టీ తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. కానీ మట్టికప్పుల ద్వారా ఆ సమస్యలు వచ్చే అవకాశం లేదు. వీటిలో ఉండే ఆల్కలీన్ జీర్ణాశయంలో ఆమ్లాల అధిక ఉత్పత్తిని నిరోధిస్తుంది. ప్లాస్టిక్ కప్పులలో టీ తాగడం ద్వారా పొట్టకు హాని కలిగించే రసాయనాలు శరీరంలోకి వస్తాయి. అదే మట్టి పాత్రలో టీ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయన్న భయం లేకుండా హాయిగా టీ ఆస్వాదించవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on