గిన్నిస్ బుక్‌లో మన కూచిపూడి వీడియో
భారతదేశపు ఎనిమిది శాస్త్రీయ నృత్యశైలులలో ఒకటి మన కూచిపూడి నాట్యం. తెలుగు నేల మీద పుట్టిన ఈ కూచిపూడి నాట్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావటంతో బాటు నేటి తరానికి ఈ అపురూప కళారూపం యొక్క ప్రత్యేకతలు, విశిష్టతలను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రఖ్యాత కూచిపూడి నర్తకి బి. గిరిష్మ. శివ సాయి శ్రీనివాస నాట్యాలయం డాన్స్ అకాడమీ ద్వారా ఎందరికో ఈ నాట్యాన్ని నేర్పుతూ ఎందరో ప్రతిభావంతులైన కళాకారులను తయారుచేస్తున్నారు.
దీనికి కొనసాగింపుగా, డిసెంబరు 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రతిష్ఠాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధనే లక్ష్యంగా ఒక మహా బృంద నాట్య కార్యక్రమాన్ని తన శిష్యురాళ్లతో కలిసి గిరిష్మ గారు ప్రదర్శించటమే గాక.. గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ఈ కార్యక్రమానికి ఎందరో కూచిపూడి కళాకారులు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరై గిరిష్మ గారిని అభినందించటమే గాక ఆమె ప్రయత్నాన్ని ప్రశంసించారు.
మరిన్ని వీడియోల కోసం :
