రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం. పాల్వంచ వద్ద కారు డోర్ అకస్మాత్తుగా తెరచుకోవడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. సగ్గు రాఘవేందర్ రెడ్డి అక్కడికక్కడే మరణించగా, ఆవుల మహేశ్వర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఇద్దరు యువకులు బైక్‌పై దూసుకెళ్తున్నారు. రోడ్డు పక్కన ఓ కారు ఆగి ఉంది. కారు పక్కనుంచి టూ వీలర్ వెళ్తోంది. ఇంతలో ఒక్కసారిగా కారు డోరు తెరుచుకుంది. అంతే జరగకూడని ఘోరం జరిగిపోయింది. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎంతో ఉత్సాహంగా బైక్‌పై ఇద్దరు యువకులు వెళ్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఇంటికి వెళ్లిపోతాం అనగా ఊహించని దారుణం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు రూపంలో మృత్యువు వెంటాడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రోడ్డు మీదుగా బూర్గంపాడు మండలం మోరం పల్లి బంజర కు చెందిన సగ్గు రాఘవేందర్ రెడ్డి, ఆవుల మహేశ్వర్ రెడ్డి, ఇద్దరు కలిసి బైక్‌పైన వెళ్తున్నారు. ఈ క్రమంలో జగన్నాథపురం దగ్గరికి రాగానే రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు డ్రైవర్ అనుకోకుండా డోర్ తెరిచాడు. దీంతొ వెనుక నుంచి టూ వీలర్ పై వస్తున్న రాఘవేంద్ర రెడ్డికి ఆ డోర్ తగిలడంతో ఎగిరి రోడ్డుమీద పడ్డాడు. స్పాట్ లో అతను చనిపోయాడు. మహే శ్వర్ రెడ్డికి తీవ్రగాయాలయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే మహేశ్వర్ రెడ్డిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ సామ రఘునాథ్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రికార్డు స్థాయిలో స్పందన
