పోలీస్ స్టేషన్‌కు చేరిన చిలక పంచాయితీ
కోనసీమలో ₹80 వేల విలువైన పెంపుడు చిలుక 'చార్లి' కనిపించకుండా పోవడంతో యజమాని బండారు దొరబాబు పోలీసులను ఆశ్రయించాడు. సంక్రాంతి రోజున తప్పిపోయిన ఈ చిలుక మనుషుల మాటలను అనుకరిస్తుంది. దొరబాబుకు ఈ చిలుక అంటే ప్రాణం. ఆచూకీ లభించకపోవడంతో ఆవేదన చెందిన యజమాని, తన చిలుకను తిరిగి ఇప్పించాలని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. రూ.80 వేల విలువైన పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో యజమాని పోలీసులను ఆశ్రయించాడు. కాట్రేనికోన మండలం కొత్తపాలేనికి చెందిన బండారు దొరబాబు అనే వస్త్ర వ్యాపారి తన పెంపుడు చిలుక ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దొరబాబుకు పక్షులంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో రూ.80 వేలు వెచ్చించి ప్రత్యేక జాతికి చెందిన చిలుకను కొనుగోలు చేశాడు. దానికి ‘చార్లి’ అని పేరు పెట్టుకుని తన కుటుంబ సభ్యుడిగా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. మనుషుల మాటలను స్పష్టంగా అనుకరిస్తూ మాట్లాడే ఆ చిలుక అంటే దొరబాబుకు ప్రాణం. ఇటీవల సంక్రాంతి పండుగ రోజున పంజరాన్ని శుభ్రం చేసే సమయంలో చిలుక బయటకు వచ్చి ఎగిరిపోయింది. సాయంత్రానికి తిరిగి వచ్చేస్తుందిలే అనుకున్నాడు దొరబాబు. కానీ ఆ చిలుక తిరిగి రాలేదు. రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. ఊరంతా వెతికినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన దొరబాబు పోలీసులను ఆశ్రయించాడు. తన చిలుకను సమీప ప్రాంతంలో ఎవరో పట్టుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన దొరబాబు, ఎలాగైనా తన చిలుకను తనకు తిరిగి అప్పగించాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. అపురూపంగా పెంచుకున్న చిలుక కోసం యజమాని పడుతున్న ఆవేదన స్థానికులను కదిలిస్తోంది. ఇప్పుడు ఈ చిలుక పంచాయితీ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: భగ్గుమంటున్న బంగారం.. ఇవాళ ధర ఎంతంటే
రథసప్తమి వేళ అరసవిల్లిలో అర్ధరాత్రి నుంచే పూజలు ప్రారంభం
TOP 9 ET: చిక్కుల్లో చిరు నెక్స్ట్ మూవీ ?? | బుక్ మై షోలో.. బాస్ దిమ్మతిరిగే రికార్డ్
