అరటి పండ్ల ఎగుమతికి ఏకంగా రైలునే వేశారు.. ఆ బనానా ట్రైన్ స్పెషల్ ఇదే
అనంతపురం జిల్లా పేరు ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతోంది. కరువు నేలగా ముద్ర వేసుకున్నా.. అభివృద్ధి దిశగా నడుస్తోంది. ప్రపంచదేశాలవైపు తొంగిచూస్తోంది. ఉద్యానసాగులో ఇప్పటికే గుర్తింపు పొందిన జిల్లా.. ఇప్పుడు అరటిపండ్ల ఎగుమతిలో ముందంజలో ఉంది. అక్కడ పండించే అరటి పండుకు అంతర్జాతీయంగా మంచి ఆదరణ ఉంది. అందుకే వీటనని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
అంత ప్రసిద్ధి చెందిన అరటిపండ్లను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా బనానా ట్రైన్ ని ఏర్పాటు చేసింది. మొక్కనాటిన దగ్గర నుంచి… పంట చేతికొచ్చి… విదేశాలకు ఎగుమతి అయ్యేవరకు అక్కడి అరటి పంట సాగు ఎంతో ప్రత్యేకతను చాటుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో రైతులు విస్తారంగా అరటిపంటను సాగు చేస్తారు. మొక్క నాటిన దగ్గర నుంచి అరటి గెలలు కోతకు వచ్చే సమయంలో రైతులు తీసుకునే జాగ్రత్తలు అందరినీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చలికాలంలో అరటి గెలలపై దుమ్ము, ధూళితో పాటు మంచు పడడం వల్ల అరటి పండ్లు రంగు మారుతుంటాయి. అదేవిధంగా చలికాలం రాత్రిపూట మంచు… పగటిపూట ఎండ తీవ్రత వల్ల చీడపురుగులు అధికంగా వ్యాప్తి చెందుతాయన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొంతులో 22 కత్తులను దింపి గిన్నీస్ రికార్డు కొట్టాడు.. కానీ..
TOP 9 ET News: సంక్రాంతిని మడతెట్టిన వెంకీ | 2nd డే దిమ్మతిరిగే వసూళ్లు డాకు విశ్వరూపం