Ravana: రావణుడు పుష్పక విమానంలో సంచరించాడా..? పరిశోధనలు తిరిగి ప్రారంభం.. (వీడియో)

|

Nov 25, 2021 | 9:28 AM

లంకేశుడు రావణుడి వద్ద నిజంగానే విమానాలు ఉన్నాయా? రామాయణ ఇతిహాసం కూడా ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పింది. అయితే, నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి శ్రీలంక ప్రభుత్వం గతంలోనే ఓ పరిశోధక బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే...


లంకేశుడు రావణుడి వద్ద నిజంగానే విమానాలు ఉన్నాయా? రామాయణ ఇతిహాసం కూడా ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పింది. అయితే, నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి శ్రీలంక ప్రభుత్వం గతంలోనే ఓ పరిశోధక బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే, కరోనా కారణంగా ఆగిపోయిన పరిశోధనలు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ కీలకమైన పరిశోధనలో భారత ప్రభుత్వం కూడా పాల్గొనాలని శ్రీలంక పరిశోధన బృందం కోరుతోంది.

ప్రపంచంలోనే మొదటిసారి విమానాన్ని ఉపయోగించింది రావణుడు అని శ్రీలంక ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే, ఇది కేవలం కల్పితమని కొట్టిపారేసే వాళ్లూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇందులో నిజమెంతో తెలుసుకోవడం కోసం రెండేళ్ల కిందట పౌరవిమానయాన నిపుణులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, పురావస్తు శాఖవారు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో చర్చోపచర్చలు జరిగాయి. ఆఖరికి రావణుడు విమానంలో శ్రీలంక నుంచి భారత్‌కు ప్రయాణించాడని ఏకాభిప్రాయానికి వచ్చారు.

శ్రీలంక ప్రభుత్వం ఈ అంశంపై పరిశోధన కోసం 5 మిలియన్‌ శ్రీలంకన్‌ రూపీస్‌ నిధులను విడుదల చేసింది. ఆ వెంటనే కరోనా మహమ్మారి విజృంభణ.. లాక్‌డౌన్‌ పరిణామాలతో పరిశోధన ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడం.. అన్ని కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతుండటంతో శ్రీలంక ప్రభుత్వం పరిశోధనను తిరిగి ప్రారంభించేందుకు అంగీకరించింది. దీంతో ‘రావణుడి విమానం’పై పరిశోధనలు వచ్చే ఏడాది తిరిగి ప్రారంభం కానున్నాయి.

Follow us on