Viral Video: గాలిపటంతో పాటు ఎగిరిపోయిన వ్యక్తి.. 30 అడుగుల ఎత్తులో పతంగిలా ఎగురుతూ..వైరల్ అవుతున్న వీడియో
చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గాలిపటాలు ఎగరవేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. అలా స్నేహితులతో కలిసి సరదాగా గాలిపటాలు ఎగురవేస్తున్న ఓ వ్యక్తి పతంగితోపాటే ఎగిరిపోయాడు. ఈ ఘటన శ్రీలంకలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో
చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గాలిపటాలు ఎగరవేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. అలా స్నేహితులతో కలిసి సరదాగా గాలిపటాలు ఎగురవేస్తున్న ఓ వ్యక్తి పతంగితోపాటే ఎగిరిపోయాడు. ఈ ఘటన శ్రీలంకలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. శ్రీలంకలో ‘తై పొంగల్’ అనే పండగను వేడుకగా జరుపుకొంటారు. ఇందులో భాగంగా గాలిపటాలు ఎగర వేసే పోటీలు నిర్వహిస్తారు. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఈ పొటీల్లో పాల్గొంటారు. రకరకాల గాలిపటాలు తయారుచేసి ఎగురవేస్తారు.ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా శ్రీలంకలోని పాయింట్ పెడ్రోలో ‘ కైట్ ఫ్లయింగ్ ’ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తి తన ఆరుగురు స్నేహితులతో కలిసి ఒక జనపనార తాళ్లతో కూడిన పెద్ద గాలిపటాన్ని తయారుచేశాడు. ఆతర్వాత ‘కైట్ ఫ్లయింగ్ గేమ్’లో పాల్గొనడానికి వచ్చాడు. తన గాలిపటాన్ని ఎగరవేశారు. అయితే ఆ సమయంలో బృందంలోని ఆరుగురు సభ్యులు గాలిపటం తాడును నెమ్మదిగా వదిలేసారు కానీ అతను మాత్రం అలాగే పట్టుకుని నిల్చున్నాడు. దీంతో గాలిపటంతో సహా అతను గాల్లోకి వెళ్లిపోయాడు. స్నేహితులు తాడుని వదిలేయ్ అంటున్నా భయంతో అతను తాడును వదల్లేదు. దీంతో అలాగే 30 అడుగుల ఎత్తుకు వెళ్లిపోయాడు. కొన్ని నిమిషాల పాటు అలాగే గాల్లోనే వేలాడాడు. కొద్ది సేపటికి గాలిపటం కొద్దిగా భూమికి దగ్గరగా వచ్చింది. అప్పుడు తాడు వదిలేయడంతో నేలపై పడిపోయాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తికి కొద్దిపాటి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ‘ఇది కైటా? పారాచూటా? ‘ అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.