ఆ గ్రామ చిన్నారులు అంతర్జాతీయ చెస్ ఛాంపియన్స్ వీడియో
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు చేసే కృషి, త్యాగాలను గుర్తించి.. వారికి గౌరవం అందించడం టీచర్స్ డే ఉద్దేశం. ఈ దినోత్సవం గురు శిష్యుల మధ్య ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని ఎంతగానో గుర్తుచేస్తుంది. నాయకులను, శాస్త్రవేత్తలను, కళాకారులను, క్రీడాకారులను తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర ప్రత్యేకం. కాబట్టి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గురువులందరినీ ఒకసారి తలుచుకుంటూ వారికి ఈ రోజు ప్రత్యేక శుభాకాంక్షలు..
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మట్టిలోని మాణిక్యాల గురించి. గుజరాత్‌లోని మహీసాగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు కూడా తిరగని ఓ కుగ్రామం ఉంది. పేరు రతుసింగ్ మువాడా. దాదాపు వంద ఇళ్లు ఉన్న ఈ గ్రామం రాష్ట్రం గర్వించేలా చెస్ ఛాంపియన్లను తయారుచేస్తోంది. ఈ గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ ఫిడె ర్యాంకులు సాధించారు. ఈ విజయం వెనుక ఉన్నది గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పీటీ టీచర్ సందీప్ ఉపాధ్యాయ్. ఈయన 2022 నుంచి దాదాపు 200 మంది పేద కుటుంబాల పిల్లలకు సొంత ఖర్చుతో చెస్‌లో శిక్షణ ఇచ్చారు. వీరిలో 14 మంది విద్యార్థులు జిల్లా క్రీడా పాఠశాలకు ఎంపికయ్యారు. గతేడాది జూన్‌లో రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికైన 8 మంది విద్యార్థుల్లో ఏడుగురు ఈ గ్రామస్థులే. అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ టోర్నమెంటులోనూ ఈ పాఠశాల బాలికలు వివిధ కేటగిరీల్లో పతకాలు సాధించారు. గ్రాండ్‌మాస్టర్లు, ప్రపంచ ఛాంపియన్లుగా విద్యార్థులను తయారుచేయడమే తన లక్ష్యమని సందీప్ చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
