Viral: ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.. ఇప్పటికే 11సార్లు కాటేసిన నల్లత్రాచు.!

|

Dec 12, 2024 | 9:59 AM

పాములు పగబడతాయా అంటే అవుననే అనిపిస్తోంది.. ఈ ఘటన చూస్తే. ఓ యువతిని నల్లత్రాచు గత ఐదేళ్లుగా వెంటాడుతోంది. ముహూర్తం నిర్ణయించినట్టుగా ప్రతి శుక్రవారం ఆ పాము ఆ యువతిని వెంటాడి మరీ కాటేస్తోంది. ఇప్పటికి 11 సార్లు కాటేసింది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం..

ఉత్తరప్రదేశ్‌లోని చర్ఖారీ తహసీల్‌లోని పంచంపుర గ్రామానికి చెందిన దల్పత్‌ కుమార్తె రోషిని పొలంలో పనిచేస్తుండగా నల్లత్రాచుపాము కాటు వేసింది. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆ పాము తన కుమార్తెను మళ్లీ మళ్లీ కాటేస్తోందని దల్పత్ తెలిపారు. 2019 నుంచి ఆ పాము తన కుమార్తెను వెంటాడుతోందని వాపోయారు. ఇప్పటికే 11 సార్లు తన కుమార్తెను కాటు వేసిన నల్లత్రాచు తాజాగా మరోమారు యువతిని కాటు వేసింది. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన తెలిసిన డాక్టర్లు కూడా షాక్‌ అవుతున్నారు. ఇలా తరచూ యువతిపై పాము దాడి చేస్తుండటం పట్ల కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. పాము దాడి నుంచి తమ కుమార్తెను రక్షించుకునేందుకు తాంత్రికులు, భూతవైద్యులకు కూడా చూపించామని బాధిత యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఏదైనా దోషం ఉందేమోనని గ్రామంలో శివాలయం నిర్మించి, విగ్రహాన్ని ప్రతిష్టించామని, పదే పదే ఆ పరమశివుడికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించినట్టు చెప్పారు. కానీ పాము మాత్రం తన కూతురిని వెంబడించడం వదలడం లేదని వాపోయారు. 2019లో తన కూతురు పొలంలో పనిచేస్తుండగా, అనుకోకుండా ఆమె ఒక నల్ల తాచు పాము తోకను తొక్కేసింది. దాంతో ఆ పాము రోషినిని కాటేసింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రోషిణిని కాపాడారు. కానీ, ఆ తరువాత కూడా ఆ పాము వరుసగా తన కూతురుపై దాడి చేస్తూనే ఉందని చెప్పాడు. ఈ పాము కారణంగా భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని చెప్పారు. పాము కాటు నుంచి తప్పించుకునేందుకు గానూ ఆమె తన బంధువుల ఇంటికి వెళ్లినా కూడా పాము ఆమెను వదల్లేదు. ప్రతిసారీ శుక్రవారం రోజే పాము వచ్చి తమ కూతురిని కాటువేస్తోందని చెప్పారు. ఈసారి కూడా శుక్రవారం మరోసారి పాము కాటేసింది. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. అంతేకాదు..జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా మంచంపై ఉన్న తమ కూతురిని పాము కాటు వేసిందని దల్పత్ చెప్పాడు. ఈ ఘటనలతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.