khammam Heatwave: ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు

Updated on: May 03, 2024 | 1:18 PM

ఖమ్మం జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. జిల్లా మొత్తం 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.

ఖమ్మం జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. జిల్లా మొత్తం 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండతీవ్రతకు వడ గాడ్పులు కూడా తోడయ్యాయి. కోల్ బెల్ట్ ఏరియాలో పరిస్థితి మరీ దారుణంఎండలకు బయటకు రావాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు పెట్రోల్ బంక్‌లో ప్రత్యేకంగా కూలర్స్ ఏర్పాటు చేశారు. వడగాల్పుల నుంచి వాహనదారులకు ఈ కూలర్స్ కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.