ఫ్లైఓవర్‌పై వేగంగా దూసుకెళ్లినకారు.. ఆ తర్వాత..

Updated on: Nov 20, 2025 | 2:01 PM

కేరళలోని కన్నూర్‌లో జాతీయ రహదారి 66 సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. అసంపూర్తిగా ఉన్న వంతెన మధ్య ఖాళీలోకి కారు వేగంగా దూసుకువెళ్లి పడిపోయింది. ప్రమాద హెచ్చరికలను విస్మరించిన డ్రైవర్ స్వల్ప గాయాలతో స్థానికుల సహాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ఎక్కి మధ్యలో ఉన్న గ్యాప్‌లో పడిపోయింది కారు. కాసేపు గాలిలో కారు వేలాడగా, స్వల్ప గాయాలతో ఉన్న డ్రైవర్.. స్థానికుల సహాయంతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కేరళ రాష్ట్రం, కన్నూర్ జిల్లాలో జాతీయ రహదారి 66 సమీపంలో ఓ ఫ్లైఓవర్‌ నిర్మాణ దశలో ఉంది. ఆ వంతెన పై నుంచి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆ కారు నిర్మాణంలో ఉన్న వంతెన రెండు భాగాల మధ్య ఖాళీ ఉండటంతో కారు అందులో పడిపోయింది. కిందనుంచి చూస్తున్నవారికి ఆ కారు గాల్లో తలక్రిందులుగా వేలాడుతున్నట్టుగా కనిపిస్తుంది. తలస్సేరి నుంచి కన్నూర్‌కు ప్రయాణిస్తున్న ఈ కారు, వంతెన వద్ద ఏర్పాటు చేసిన భద్రతా హెచ్చరికలను దాటి అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్‌ పైకి దూసుకెళ్లింది. ఆ వంతెన నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో, రెండు భాగాల మధ్య కొంత ఖాళీ ఏర్పడింది. వేగంగా వచ్చిన కారు ఆ ఖాళీలో పడిపోయింది. ఆ రెండు భాగాలమధ్య ఖాళీ ఇరుకుగా ఉండటంతో కారు అక్కడే ఇరుక్కుపోయింది.ఇంతలో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయకసిబ్బంది, స్థానికులు కలిసి కారు డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం కారును మెల్లగా కిందకు తీసుకువచ్చారు. కారు డ్రైవర్ పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

IPL 2026: ఐపీఎల్ 2026 వేలం ముహూర్తం ఫిక్స్..

అరె.. ముల్లు తీయడం ఇంత ఈజీనా.. ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలియక.. కష్టపడ్డానే

ఐ బొమ్మ రవి.. లైఫ్‌ స్టైల్‌ ఇదే !! డబ్బు సంపాదన అంటే ఎందుకంత కసి ??

తనూజ మాస్టర్ ప్లాన్.. దివ్య, భరణికి చెక్‌ మేట్‌

TOP 9 ET News: మహేష్ 100 కోట్లు.. జక్కన్న 200 కోట్లు | ‘వారణాసి’ నుంచి సాంగ్ రిలీజ్‌