జంగిల్‌ సఫారీలో ఊహించని ఘటన.. బాలుడిపై చిరుత..

Updated on: Aug 21, 2025 | 11:15 AM

ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు జంగిల్‌ సఫారీకి వెళ్తుంటారు. రోజంతా ఉరుకులు పరుగులతో జీవితం గడిపేవారు కూడా వారాంతంలో కుటుంబంతో కలిసి ఇలాంటి పర్యటనలకు వెళ్తుంటారు. అలా వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని ఘటన ఎదురైంది. సఫారీకి వెళ్లిన పర్యాటకులపై చిరుత దాడి చేసింది.

ఈ ఘటనలో 13 ఏళ్ల బాలుడు గాయపడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. పర్యాటకులకు అడవిలోని జంతువులను చూపిస్తూ షఫారీ వెహికల్‌ డ్రైవర్‌ వాహనాన్ని నెమ్మదిగా నడుపుతూ వెళ్తున్నాడు. ఇంతలో వారికి ఓ చిరుతపులి కనిపించింది. చిరుతపులిని చూపిస్తూ డ్రైవర్ ముందుగా తన ముందున్న బొలెరోను నెమ్మదిగా నడుపుతూ వెళ్తున్నాడు. ఇంతలో చిరుత ఊహించని విధంగా ఆ వాహనం వైపు పరుగెత్తుకొచ్చి దాడికి యత్నించింది. డ్రైవర్‌ వాహనం వేగం పెంచాడు. చిరుతకూడా వేగంగా పరుగెత్తుకొచ్చి వాహనం కిటికీని పట్టుకొని అందులోని వ్యక్తులపై తన పంజాతో దాడిచేసింది. ఈ ఘటనలో వాహనంలోని 13 ఏళ్ల బాలుడు గాయపడ్డాడు. చిరుతపులి దాడి చేయడాన్ని చూసి, డ్రైవర్ కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. కారును చిరుత వెంబడించింది. ఈ దృశ్యాలను ఆ వాహనం వెనుక వెళ్తున్న మరో కారులో కూర్చున్న వ్యక్తులు తమ కెమెరాలో బంధించారు. గాయపడిన బాలుడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. చికిత్స అనంతరం బాలుడు కోలుకున్నాడని డాక్టర్లు తెలిపారు.ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులోని బన్నేర్‌ఘట్ట బయోలాజికల్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మునిగిన ముంబై.. ఆర్థిక రాజధాని అతలాకుతలం

Weather Update: మరో మూడు రోజులు వానలు దంచుడే దంచుడు .. ఈ జిల్లాలకు బిగ్‌ అలర్ట్‌..

Roopchand Fish: రక్తం రుచి మరిగిన చేప.. ఇతర చేపలకు భిన్నం

పీఎం కిసాన్‌ డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి

ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ గిఫ్ట్‌ పార్శిల్‌ అందుకున్న భర్త.. చివరికి