బస్సు ఆపి డ్రైవర్‌ నమాజ్‌.. ఆ తర్వాత

Updated on: May 06, 2025 | 5:23 PM

కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒకరు నమాజ్ కోసం నడిరోడ్డుపై బస్సును ఆపడం, ప్రయాణికుల సీటులో కూర్చుని ప్రార్థన చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. డ్రైవర్ నమాజ్ పూర్తయ్యే వరకు ప్రయాణికులు నిస్సహాయంగా వేచి ఉండాల్సి వచ్చింది. కొంతమంది ప్రయాణికులు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.

ప్రయాణికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు సదరు డ్రైవర్ పై విచారణకు ఆదేశించారు. కాగా, ఈ ఘటనపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తీవ్రంగా స్పందించారు. పనివేళల్లో ప్రార్థనలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, సదరు డ్రైవర్ పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం హుబ్లీ-హవేరి మార్గంలోని జవేరి సమీపంలో ఈ సంఘటన జరిగింది. రహదారి పక్కన బస్సును నిలిపివేసిన ఆర్టీసీ డ్రైవర్, బస్సులోని ఓ సీటుపై కూర్చుని నమాజ్ చేశారు. ఆ సమయంలో బస్సులో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారు డ్రైవర్ ప్రార్థనలు పూర్తయ్యే వరకు నిస్సహాయంగా వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఘటనపై కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ మేనేజర్‌కు రాసిన లేఖలో, ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. “ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని ఆచరించే హక్కు ఉన్నప్పటికీ, విధి నిర్వహణ సమయంలో కాకుండా ఇతర సమయాల్లో చేసుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జైలు ప్రాంగణంలోనే పెళ్లి.. ఖైదీలే అతిథులు.. అదే కదా మ్యాజిక్కు

గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన భక్తుడు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ప్రాణం తీసిన చెవినొప్పి..

TOP 9 ET News: 100 కోట్లు కొల్లగొట్టిన సర్కార్‌.. హాలీవుడ్ లోనూ కలెక్షన్ల రచ్చ

ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు ?? బన్నీ- బ్రహ్మీ ట్రోల్స్‌ వాసు అసహనం