Karnataka: తల మసాజ్ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
కటింగ్ షాప్‌లో తల మసాజ్ చేసుకున్న యువకునికి పక్షవాతం వచ్చింది, లక్ష రూపాయలు ఖర్చు చేసి చికిత్స తీసుకుని రెండు నెలల విశ్రాంతి తరువాత కోలుకున్నాడు. సరైన శిక్షణ లేకుండా మసాజ్ చేయడం వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో హౌస్‌కీపింగ్ చేస్తున్న బళ్లారి యువకుడు ఓ కటింగ్ షాప్‌కు వెళ్లి క్షవరం చేయించుకున్నాడు. తరువాత ఉచితంగా తల మసాజ్ చేస్తానంటే సరే అన్నాడు.

ఆ సమయంలో సడెన్‌గా గొంతు తిప్పడంతో నొప్పి కలిగింది. మసాజ్ ముగించుకుని ఇంటికి వెళ్లాడు. కానీ గంట తరువాత దేహం ఎడమవైపు స్వాధీనం కోల్పోయింది. దీంతో భయపడిన కల్లేశ్ సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాడు. మెడకాయ తిప్పడంతో శీర్ష ధమని దెబ్బతిని మెదడుకు రక్త సరఫరా క్షీణించి పక్షవాతం వచ్చిందని వైద్యులు తెలిపారు.
వైద్యనిపుణుడు డాక్టర్ శ్రీకంఠస్వామి చెప్పినదాని ప్రకారం చూస్తే.. సాధారణ పార్శ్వవాయువు కు భిన్నమైన సమస్యకు గురయ్యాడనీ బలవంతంగా గొంతు– మెడను తిప్పడం వల్ల ఈ సమస్య తలెత్తిందని వివరించారు. తల మసాజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బాధితుడు.. లక్ష రూపాయలు వరకు ఖర్చు పెడితే కాని.. మళ్లీ మామూలు మనిషి కాలేకపోయాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.