తాళి కట్టబోతుండగా పెళ్లి ఆపిన వధువు.. రియల్ హీరోగా వరుడు..
పెళ్లి వేదిక అంతా బంధుమిత్రులతో కళకళలాడుతోంది. మంగళ వాయిద్యాలు మోగుతుండగా.. వరుడు వధువు మెడలో తాళి కడతాడని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. సరిగ్గా అప్పుడే పెళ్లి కూమార్తె పీటల మీద నుంచి లేచి నిలబడింది. దీంతో షాకైన వరుడు కూడా లేచి నిలబడగా.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ బాంబ్ పేల్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని తిట్టడం ప్రారంభించారు. కానీ వరుడు మాత్రం భిన్నంగా స్పిందించి.. అందరి మనసులను గెలుచుకున్నారు. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఈ వింత ఘటన జరిగింది.
నేను వేరే అబ్బాయిని ప్రేమించాను.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. తాను ప్రేమించిన వ్యక్తి వేరే సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో.. ఇంట్లో చెబితే ఎక్కడ ఒప్పుకోరో అన్న భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, కానీ మనసు చంపుకుని మరొకరిని పెళ్లి చేసుకోలేనని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. దీంతో పెళ్లి మండపంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పల్లవి తల్లిదండ్రులు, బంధువులు ఆమెను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కుటుంబ గౌరవం పోతుందని, ఇన్ని ఖర్చులు పెట్టుకుని పెళ్లి ఆపేస్తే సమాజంలో తల ఎత్తుకోలేమని నచ్చజెప్పారు. అయినా పల్లవి తన నిర్ణయం మార్చుకోలేదు. తన ప్రేమ కోసం ఎంతటి కష్టనష్టాలకైనా సిద్ధమని ఆమె స్పష్టం చేసింది.సాధారణంగా ఇలాంటి సమయాల్లో వరుడి వైపు వారు గొడవకు దిగడం లేదా పరువు నష్టం కోరడం చూస్తుంటాం.
మరిన్ని వీడియోల కోసం :
నో మోర్ డౌట్స్..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
రామాయణ టీజర్ అంచనాలను అందుకుందా?
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం
Follow Us