కసిగా లవర్ దగ్గరకు వెళ్ళాడు.. ప్రేమగా కొరికి చేతిలో పెట్టింది..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఒక వింత ఘటనలో, లైంగిక వేధింపులకు గురిచేసి బలవంతంగా ముద్దుపెట్టుకున్న మాజీ ప్రియుడి నాలుకను ఓ మహిళ కొరికింది. తనను రక్షించుకోవడానికి ఆమె ఈ పని చేసింది. రక్తస్రావంతో బాధపడిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. తనను లైంగికంగా వేధించి.. బలవంతంగా ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియుడి నాలుకను కోరికేసింది ఓ మహిళ. ఆ వ్యక్తిని కాన్పూర్ నివాసిగా గుర్తించారు పోలీసులు. ముప్పై ఐదు సంవత్సరాల సదరు వ్యక్తికి అప్పటికే వివాహం అయింది. బాధిత మహిళతో గతంలో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆ మహిళ తల్లిదండ్రులు ఆమెకు వేరొకరితో వివాహం నిశ్చయించారు. దీంతో ఆమె మాజీ ప్రియుడ్ని కలవడం మానేసింది. దీంతో తనను కలవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. నవంబరు 17 సోమవారం మధ్యాహ్నం ఆ మహిళ స్థానిక చెరువు వద్దకు వెళ్లింది. అది గమనించిన ప్రియుడు ఆమెను వెంబడించాడు. అక్కడ ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా.. బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. దీంతో తనను తాను రక్షించుకునేందుకు ఆ మహిళ సదరు వ్యక్తి నాలుకను కొరికి పారిపోయింది. ఆ మహిళ చేసిన పనితో ఆ వ్యక్తికి తీవ్ర రక్తస్రావం అయ్యి.. నొప్పితో కేకలు వేయగా.. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అతన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స తర్వాత, వైద్యులు ఆ వ్యక్తిని కాన్పూర్‌లోని పెద్దాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పందిస్తూ కేసు నమోదు చేశామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో కొడుకా.. నా కడుపున ఎందుకు పుట్టావురా !! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
భద్రాచలం గుడిలో ప్రసాదం దందా.. అధికారులే సూత్రధారులు
Mars: అంగారకుడిపై వింత రాయి.. ఇది ఎక్కడి నుండి వచ్చింది ??
కూతురిని ఇంట్లో బంధించి.. నరకం చూపిన తల్లి.. అమ్మ ఇలా కూడా చేస్తుందా !!
వాకింగ్ కు వెళ్లిన గర్భిణి.. మృత్యు రూపంలో దూసుకొచ్చిన కారు..
