‘నాకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటానంటే.. ఎగ్జామ్‌లో పాస్ చేస్తా’
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నువ్వు ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలంటే నాకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండాలని, అంతేకాకుండా 5 వేల రూపాయలు సమర్పించుకోవాలని డిమాండ్ చేశాడు.
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నువ్వు ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలంటే నాకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండాలని, అంతేకాకుండా 5 వేల రూపాయలు సమర్పించుకోవాలని డిమాండ్ చేశాడు. లేదంటే పరీక్షలో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించాడు. అందుకు యువతి నిరాకరించింది. అయినప్పటికీ అతడు వేరు వేరు నంబర్లనుంచి తరచుగా కాల్స్ చేస్తూ, మెసేజ్‌లు పెడుతూ విసిగించడం మొదలుపెట్టాడు. దాంతో చేసేదిలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. మహరాజ్‌పుర్‌కు చెందిన బాధిత యువతి కాన్పుర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటోంది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో ఆమె.. మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయింది. కేవలం 11 మార్కులే వచ్చాయి. దీంతో ఆ సబ్జెక్ట్‌కు రీకౌంటింగ్‌కు కట్టింది. నవంబరులో ఆమె మొబైల్ నంబరుకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోను, మెసేజ్ వచ్చింది. ఈ క్రమంలో ఆమె రీకౌంటింగ్‌లో కూడా ఫెయిల్ అయింది. గతంలో 11 మార్కులు రాగా.. రీకౌంటింగ్‌లో సున్నా వచ్చాయి. దాంతో షాక్‌తిన్న యువతి ఇది తనకు కాల్ చేసిన వ్యక్తి పనే అని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Waltair Veerayya: రవితేజ పాత్రను పొరపాటున లీక్ చేసిన చిరు..
Director Shankar: చరణ్ ఫ్యాన్స్ కోసం… శంకర్ భారీ సర్‌ప్రైజ్..
మెగాస్టార్ ముందు పొరపాటు.. యాంకర్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్
Director Bobby: ‘మొదట్లో అలా చేసేసరికి.. చిరు కోపగించుకున్నారు’
Waltair Veerayya: దిమ్మతిరిగే ఫైట్స్ ఉంటాయి కాచుకోండిక !!