Waltair Veerayya: దిమ్మతిరిగే ఫైట్స్ ఉంటాయి కాచుకోండిక !!

Waltair Veerayya: దిమ్మతిరిగే ఫైట్స్ ఉంటాయి కాచుకోండిక !!

Phani CH

|

Updated on: Dec 29, 2022 | 9:04 AM

ఈ మధ్య ఏదో కాస్త తగ్గించారు కాని.. ఆ రోజుల్లో చిరు సినిమాల్లో కుప్పలు తెప్పలుగా మాసీ ఫైట్లు ఉండేవి. దద్దరిల్లిపోయే స్టంట్స్ ఉండేవి. ఛాలెంజ్‌ చేసి మరీ విలన్‌ను కొట్టే కాన్సెప్ట్‌లు ఉండేవి.



ఈ మధ్య ఏదో కాస్త తగ్గించారు కాని.. ఆ రోజుల్లో చిరు సినిమాల్లో కుప్పలు తెప్పలుగా మాసీ ఫైట్లు ఉండేవి. దద్దరిల్లిపోయే స్టంట్స్ ఉండేవి. ఛాలెంజ్‌ చేసి మరీ విలన్‌ను కొట్టే కాన్సెప్ట్‌లు ఉండేవి. ఇంట్రో.. ఇంటర్వెల్ … క్లైమాక్స్‌ కలుపుని జెస్ట్ ఫైట్సే.. 40 నిమిషాల నిడివి వరకు ఉండేవి. కాని రీసెంట్ డేస్లో మాత్రం ఇలాంటి ఎపిసోడ్స్ ను తగ్గించారు చిరు. కాస్త క్లాసీగా స్టైలిస్‌గా బౌన్స్ బ్యాక్ ఫైట్లు మాత్రమే చేస్తూ.. తన ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. అలాంటి చిరు మళ్లీ ఇప్పుడు తన పాత పద్దతిలోకి వచ్చారు. వాల్తేరు వీరయ్యలో … దిమ్మతిరిగేలా.. దద్దరిల్లి పోయేలా ఫైట్స్ ఉంటాయంటూ తాజా ప్రెస్ మీట్లో చెప్పారు. చెప్పడమే కాదు.. మళ్లీ ఓ లీకిచ్చేశారు. ఎస్ ! వాల్తేరు వీరయ్య ప్రెస్‌ మీట్లో రవితేజ పాత్ర గురించి. అది సినిమాల్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందనేదాన్ని ఫ్లోలో చెప్పేసిన చిరు. ఆ తరువాత ఈ సినిమాలోని ఫైట్ల గురించి కూడా రివీల్ చేశారు. ఇంట్రో అండ్ క్లైమ్యాక్స్ పీటర్‌ హెయిన్స్ ఫైట్స్ ఉంటాయని.. వాటిని మీరు ఊహించలేదన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గన్ను తీయాల్సిన అవసరం ఏమొచ్చింది ?? షోలో హాట్ డిస్కషన్

Published on: Dec 29, 2022 09:04 AM