కాకినాడ సముద్రంలో భారీ చేపలు.. ఆనందంలో గంగపుత్రులు

Updated on: Feb 02, 2026 | 6:34 PM

చాలా రోజుల విరామం తర్వాత కాకినాడ సముద్రంలో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. కుంభాభిషేకం రేవు వద్దకు పెద్దఎత్తున చేపలను తీసుకొచ్చిన మత్స్యకారులు, వాటిని వరుసగా పేర్చి బహిరంగ వేలంలో అమ్మకానికి పెట్టారు. వందలాది భారీ చేపలు ఒకే చోట కనిపించడంతో రేవు సందడి వాతావరణాన్ని సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి రకరకాల భారీ చేపలు వలలో పడటంతో గంగపుత్రులు ఆనందం వ్యక్తం చేశారు.

చాలా రోజుల విరామం తర్వాత కాకినాడ సముద్రంలో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. కుంభాభిషేకం రేవు వద్దకు పెద్దఎత్తున చేపలను తీసుకొచ్చిన మత్స్యకారులు, వాటిని వరుసగా పేర్చి బహిరంగ వేలంలో అమ్మకానికి పెట్టారు. వందలాది భారీ చేపలు ఒకే చోట కనిపించడంతో రేవు సందడి వాతావరణాన్ని సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి రకరకాల భారీ చేపలు వలలో పడటంతో గంగపుత్రులు ఆనందం వ్యక్తం చేశారు. ట్యూనా, కింగ్ ఫిష్, సీర్ ఫిష్, రొయ్యలు, పెద్ద పరిమాణంలోని ఇతర సముద్ర చేపలు అధికంగా దొరకడంతో వ్యాపారులు కొనుగోలుకు పోటీపడ్డారు. వేలం ప్రక్రియలో వ్యాపారులు ఉత్సాహంగా పాల్గొని భారీ ధరకు కొనుగోలు చేసారు. చాలా కాలంగా సరైన చేపల వేట లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, ఈసారి అనూహ్యంగా పెద్దసంఖ్యలో చేపలు దొరికాయని, లక్షల్లో వ్యాపారం జరుగుతుందని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. సముద్రంలో అనుకూల పరిస్థితులు ఉండటం, సరైన వేట సమయం కలిసి రావడం వల్లే ఈ స్థాయిలో భారీ చేపలు లభించాయని వారు తెలిపారు. భారీ చేపల రాకతో కాకినాడ రేవులో వ్యాపార లావాదేవీలు ఊపందుకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్ కాల్పులపై సీపీ సజ్జనార్‌ కీలక వివరాలు

సౌమ్య కుటుంబానికి ‘కోటి’ ఎక్స్‌గ్రేషియా

Nirmala Sitharaman: ఇక జిల్లాకో బాలికల హాస్టల్..

మెగా వారసుడు పుట్టిన వేళ.. బాక్సాఫీస్ వార్‌కు రెడీ అవుతున్న చిరు-బాలయ్య

సెంచరీలు కొట్టే వయసు.. 94 ఏళ్లకు కొత్త సినిమా ప్రకటన