Jet Plane – Florida: హైవేపై వెళ్తున్న కారు.. ఢీ కొట్టిన విమానం.. భారీ పేలుడు.

|

Feb 11, 2024 | 11:21 AM

అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హైవేపై అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నించిన ఓ చిన్న విమానం ప్రమాదవశాత్తూ అటుగా వెళ్తున్న కారుని ఢీకొట్టింది. దీంతో భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తమ కళ్ల ముందు జరిగిన ఈ ప్రమాదాన్ని నమ్మలేకపోతున్నామని, సినిమాల్లోని దృశ్యంలా అనిపిస్తోందని ప్రత్యక్ష సాక్షి బ్రియానా వాకర్ చెప్పారు.

అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హైవేపై అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నించిన ఓ చిన్న విమానం ప్రమాదవశాత్తూ అటుగా వెళ్తున్న కారుని ఢీకొట్టింది. దీంతో భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తమ కళ్ల ముందు జరిగిన ఈ ప్రమాదాన్ని నమ్మలేకపోతున్నామని, సినిమాల్లోని దృశ్యంలా అనిపిస్తోందని ప్రత్యక్ష సాక్షి బ్రియానా వాకర్ చెప్పారు. తమ ముందు వెళ్తున్న కారుని విమానం రెక్క ఈడ్చుకెళ్లింది. ఇదంతా సెకన్ల వ్యవధిలోనే జరిగింది. హైవేపై కారుని ఢీకొట్టడానికి క్షణాల ముందు విమానం తమ తలలపై అంగుళాల ఎత్తులోనే ప్రయాణించింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. విమానం ముక్కలు హైవేపై పడ్డాయని ఆమె వివరించారు.

కూలిన విమానం ‘బొంబార్డియర్ ఛాలెంజర్ 600 జెట్‌’గా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ధారించింది. ఓహయో స్టేట్ యూనివర్శిటీ ఎయిర్‌పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు విమానం బయలుదేరిందని, క్రాష్ జరిగిన సమయానికి నేపుల్స్‌ చేరుకోవాల్సి ఉందని నేపుల్స్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రతినిధి రాబిన్ కింగ్ తెలిపారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పైలట్ ప్రయత్నించాడని, రెండు ఇంజన్లు ఫెయిల్ అవడంతో సమస్య ఏర్పడిందన్నారు. కంట్రోల్ రూమ్‌తో మాట్లాడుతుండగానే కమ్యూనికేషన్ తెగిపోయిందని అధికారి చెప్పారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on