MLA Balaraju: ఇంత అభిమానం ఏంటయ్యా.. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు కార్ గిఫ్ట్.!

|

Jul 06, 2024 | 8:15 PM

ఎన్నికల్లో జెండాలు మోయటం, పార్టీ ఎజెండా ప్రజల్లోకి తీసుకుని వెళ్లటం , తమ నేతకే ఓటు వేసి గెలిపించమని కోరడం.. ఇది సగటు పార్టీ కార్యకర్తలు చేసే పని అనుకుంటాం. కాని పోలవరం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు మరో అడుగు ముందుకు వేశారు. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లో కి వచ్చి 2024ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే బాలరాజు కు కార్ ను గిఫ్ట్ గా ఇచ్చారు కార్యకర్తలు.

ఎన్నికల్లో జెండాలు మోయటం, పార్టీ ఎజెండా ప్రజల్లోకి తీసుకుని వెళ్లటం , తమ నేతకే ఓటు వేసి గెలిపించమని కోరడం.. ఇది సగటు పార్టీ కార్యకర్తలు చేసే పని అనుకుంటాం. కాని పోలవరం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు మరో అడుగు ముందుకు వేశారు. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లో కి వచ్చి 2024ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే బాలరాజు కు కార్ ను గిఫ్ట్ గా ఇచ్చారు కార్యకర్తలు. ఇది గతంలో ఎన్నడూ జరగని ఓ విచిత్ర ఘటనగా ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పోలవరం లాంటి నియోజకవర్గంలో ప్రతి గిరిజన గ్రామం తిరగాలంటే ఖచ్చితంగా వెహికల్ ఉండాల్సిందే. యం.యల్.ఎ గా గెలిచిన వారికి కార్ అలెవెన్సులు లభిస్తాయి. అయితే రెగ్యులర్ మెయింటినెన్స్ , ఇతర ఖర్చులు లభించిన జీతంలో సదరు శాసనసభ్యుడు భరించాలి.

ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు పరిస్థితి ని అర్ధం చేసుకున్న జనసేన కార్యకర్తలు. తమ నేత కోసం కారును గిఫ్ట్ గా ఇవ్వాలని భావించారు. అనుకున్నదే తడవుగా అందరూ ఒక్కటై లగ్జరీ కారును గిఫ్ట్ గా అందచేశారు. ఎమ్మెల్యే కి కారు పత్రాలు, కీని మాజీ డిసిసిబి ఛైర్మన్ కరాటం రాంబాబు అందచేశారు. అయితే, ఎమ్మెల్యే బాలరాజు తమ అభిమానుల కోరికను సున్నితంగా తిరస్కరించారు. తన గెలుపు కోసం కార్యకర్తలు ఎంతో చేశారని, వారి అభిమానమే నాకు చాలని అన్నారు. ఎంతో అభిమానంగా తన సౌలభ్యం కోసం కార్యకర్తలు అందించిన కారును తిరిగి వారికే అప్పగిస్తానని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.