కళ్యాణమండపానికి వచ్చిన అనుకోని అతిథి

Updated on: Oct 25, 2025 | 11:20 AM

పామును చూడగానే ఎవరికైనా భయంతో ఒళ్లు జలదరిస్తుంది. కొందరికైతే పాము పేరు చెప్పగానే భయంతో వణికిపోతారు. మరి అలాంటిది ఓ భారీ కొండచిలువ కళ్లముందు ప్రత్యక్షమైతే పరిస్థితి ఎలా ఉంటుంది? భయంతో అక్కడినుంచి పరుగులు తీస్తారు కదూ. సరిగ్గా అదే జరిగింది జగిత్యాల జిల్లాలో. ఓ కళ్యాణమండపం సమీపంలో రాత్రి వేళ భారీ కొండచిలువ జనాలను పరుగులు పెట్టించింది.

జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపం వద్ద భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దీన్ని చుసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలిసి చుట్టు పక్కలవారు కూడా అక్కడ గుమిగూడారు. ఓ షాపులోని షెట్టర్‌ మీదుగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఆ కొండ చిలువను చూసి ఆందోళన చెందారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అటవీ సిబ్బందిని వెంటపెట్టుకొని ఘటనాస్థలికి చేరుకున్నారు. కొండచిలువను జాగ్రత్తగా బంధించి అడవిలో వదిలిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడూ జనాలు ఎక్కువగా సంచరించే ఆ ప్రాంతంలోకి కొండచిలువ రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిల్లలు ఎవరైనా తెలియక అటు వస్తే పరిస్థితి ఏంటని చర్చించుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వ్యాపారులకు దొంగబాబాల బురిడీ.. పౌడర్‌ చల్లి.. డబ్బుతో పరార్‌

మహిళలకు ఆన్‌లైన్ ఉగ్రవాద కోర్సు

అమెరికా విద్యార్థి వీసా రూల్స్ మరింత కఠినం.. భారత విద్యార్థులకు ఇబ్బందే

సౌదీలో బానిసత్వ చట్టం రద్దు.. మనోళ్లకు స్వేచ్ఛ

ఛీ.. శవం చేతి బంగారు కడియాన్నివదలని హాస్పిటల్ సిబ్బంది