30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
ఇటలీలోని పాగ్లియారా డై మార్సి గ్రామం 30 ఏళ్లుగా నిశ్శబ్దంగా ఉంది, యువకులు వలస వెళ్లడంతో పాఠశాలలు మూతపడ్డాయి. లారా బుస్సి జననంతో గ్రామానికి కొత్త ఉత్సాహం వచ్చింది, జనాభా 20కి చేరింది. ఇటలీ ఎదుర్కొంటున్న జనన రేటు సంక్షోభానికి ఇది ప్రతీక. ప్రభుత్వం బేబీ బోనస్‌తో సహా ప్రోత్సాహకాలు అందిస్తోంది, లారా కుటుంబానికి 1000 యూరోలు లభించాయి. ఈ జననం గ్రామానికి, దేశానికి కొత్త ఆశను ఇచ్చింది.
ఇటలీలోని అబ్రుజ్జో కొండ ప్రాంతంలోని చిన్న గ్రామం పాగ్లియారా డై మార్సి గత 30ఏళ్లుగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. యువకులు, కుటుంబాలు వలస వెళ్లిపోవడంతో పాఠశాలలు మూతపడ్డాయి, వీధులు వెలవెలబోయాయి. మిగిలిన కొద్దిమంది వృద్ధులు మాత్రమే అక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే, లారా బుస్సి జననంతో ఆ గ్రామంలో కొత్త ఉత్సాహం ఆవరించింది. సుదీర్ఘ నిశ్శబ్దాన్ని మార్చి గ్రామానికి కొత్త ఊపిరి పోసింది. చిన్నారి జననంతో తల్లిదండ్రులు సింజియా ట్రాబుక్కో, పావ్లో బుస్సి సంతోషంలో మునిగిపోగా, ఊరు ఊరంతా పండగచేసుకుంది. లారాతో కలిపి ఆ గ్రామ జనాబా 20కి చేరింది. ఒకప్పుడు పసిపిల్లల కేరింతలే వినిపించిన బోసిపోయిన ఆ పల్లె లారా రాకతో కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. లారా పుట్టుకతో గ్రామానికి మళ్లీ భవిష్యత్తు ఉందన్న నమ్మకం కలిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. నిన్నటి దాకా తాళాలు వేసిన ఇళ్లే ఉన్న తమ గ్రామంలో ఎవరూ ఇక ఉండరని భావించామని, కానీ, 30 ఏళ్ల తర్వాత పుట్టిన చిన్నారి లారా పాగ్లియారా డై మార్సి గ్రామానికి కొత్త ఆశను తెచ్చిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లారా బారసాలను గ్రామస్తులు వేడుకలా చేసుకున్నారు. గ్రామం అంతా తరలివచ్చి ఆ చిన్నారిని ఆశీర్వదించారు. ఒక చిన్నారి పుట్టుకతో ఒక గ్రామానికి పూర్వవైభవం తిరిగి రావడం, జనాభా సంక్షోభంపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇటీవల ఇటలీ,స్పెయిన్,జర్మనీలో జననాల రేటు తగ్గింది. దీంతో జనాభా రేటును పెంచేందుకు ఆ దేశాలు ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సైతం పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు బేబీ బోనస్ కింద వెయ్యి యూరోల బహుమానం ప్రకటించారు. తాజాగా లారా జన్మించడంతో ఆమె కుటుంబానికి 1000 యూరోలు అంటే సుమారు రూ.90,000 విలువైన బేబీ బోనస్ ను ప్రభుత్వం అందించింది. లారా పుట్టుక ఒక కుటుంబానికి మాత్రమే కాకుండా, ఇటలీ ఎదుర్కొంటున్న జనాభా సంక్షోభానికి ప్రతీకగా నిలిచింది. దేశంలో జనన రేటు తగ్గిపోవడం వల్ల అనేక గ్రామాలు వెలవెలబోతున్నాయి. పాగ్లియారా డై మార్సి గ్రామం ఈ సమస్యకు ప్రత్యక్ష ఉదాహరణ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రీ బస్‌లో ఇక ఆధార్‌తో పనిలేదు మరి ఎలాగంటే..
రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే బుల్లెట్ ట్రైన్..
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
చైనా ఇంజనీర్ల మరో అద్భుతం.. అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్ నిర్మాణం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి