iPhone Offer: గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

|

Dec 28, 2024 | 7:54 PM

ఐఫోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ ఫోన్‌కు ఉన్న క్రేజే వేరు. తమ చేతిలో ఐఫోన్‌ ఉండాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. అయితే, ఆ కలలు అందరికీ నెరవేరవు. అందుకు కారణం సాధారణ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్‌ ధరలు చాలా ఎక్కువగా ఉండడమే. దీంతో కొందరు బెస్ట్‌ డిస్కౌంట్స్‌ కోసం ఎదురుచూసి వాటిని సొంతం చేసుకుంటుంటారు. అలాంటి వారికి ఓ గుడ్‌ న్యూస్‌.

గతేడాది మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్‌ 15 128GB వెరియంట్‌పై ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఊహించని డీల్‌ను ప్రకటించింది. దాదాపు 70 వేల రూపాయల విలువైన ఈ ఫోన్‌ను 27వేలకే అందిస్తోంది. సాధారణంగా iPhone 15 128GB సిరీస్‌ ధర 70 వేల రూపాయలకు ఓ రూపాయి అటు ఇటుగా ఉంటుంది. ఈ ప్రీమియం డివైజ్ ఇప్పుడు పలు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కలుపుకుని కేవలం 27 వేల రూపాయలకే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్‌లో గరిష్ఠంగా దాదాపు 32 వేల రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పించింది. అందుకోసం మీరు ఐఫోన్ 14ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 27 వేల రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ మినహాయింపుతో అయితే గరిష్ఠంగా 16 శాతం తగ్గింపుతో 59 వేల రూపాలయు ఫోన్ లభిస్తోంది.

ఎంపిక చేసిన ప్రదేశాల్లో కేవలం 14 నిమిషాల్లోనే ఈ ఫోన్‌ను డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. ఐఫోన్ 15 గతేడాది సెప్టెంబర్‌లోలో విడుదలైంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో రంగుల్లో లభిస్తుందీ ఫోన్. ఐఓఎస్ 17 వర్షన్‌పై పని చేస్తున్న ఐ-ఫోన్ 15 ఫోన్.. ఆపిల్ ఏ16 బయోనిక్ చిప్ కలిగి ఉంటుంది. 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ స్క్రీన్, డైనమిక్ ఐలాండ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.