రిటైర్డ్‌ ఉద్యోగి వినూత్న వ్యవసాయం.. దిగుబడిచూస్తే షాకవుతారు

Updated on: Jun 11, 2025 | 5:15 PM

చాలామంది 60 ఏళ్లు రాగానే ఉద్యోగం నుంచి రిటైర్డ్‌ అయిపోగానే తమ పని అయిపోయిందనుకొని ఖాళీగా కూర్చుని కాలక్షేపం చేయడం లేదంటే వయోభారం ఫీలవుతూ దూరాన ఉన్న పిల్లలను తలచుకొని ఒంటరిగా నిరుత్సాహంగా కాలం వెళ్లబుచ్చుతారు. కానీ పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెంది ఓ రిటైర్డ్‌ ఉద్యోగి మాత్రం అంతటితో తన పని అయిపోయింది అనుకోలేదు.

తనకు దొరికిన ఈ విశ్రాంతి సమయాన్ని తన ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవడంపై వెచ్చించారు. ప్రస్తుతకాలంలో తాగే పాల దగ్గరనుంచి వేసుకునే మందుల వరకూ అన్నీ కల్తీనే. ఇక కూరగాయలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులన్నీ రసాయనాలమయమే. అందుకే అతను తన ఇంటికి కావాల్సిన కూరగాయలు, పండ్లు అన్నీ తానే స్వయంగా పండించుకోవాలనుకున్నారు. అంతే తన ఇంటి ఆవరణలో ఉన్న కొద్దపాటి స్థలాన్ని, ఇంటి డాబాపైన ఉన్న స్థలాన్ని వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. ఇప్పుడు తన వ్యవసాయక్షేత్రంలో 20 రకాల పండ్లు, కూరగాయలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా సొరకాయ ఎంత పొడవుంటుంది.. మహా అంటే ఓ పొడవు ఉంటుంది. కానీ మన రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి ముత్యాల సత్తిరాజు పండించే సొరకాయలు మాత్రం ఒక్కొక్కటి ఏకంగా ఆరు అడుగుల పొడవు ఉంటుంది. అడుగున్నర పొడవైన వంకాయలు పండిస్తున్నారు. ఇక బెండకాలయలైతే 9 రకాలు ఇతని పెరట్లో కాస్తున్నాయి. ఏంటి మీరు చెబుతున్నది కూరగాయల గురించేనా అని అనుకుంటున్నారా.. అవునండి.! ఆసక్తి ఉండాలే గాని అద్భుతాలు చేయవచ్చు అని నిరూపిస్తున్నారు సత్తిరాజు. వ్యవసాయంలో దిగుబడులు రావడం లేదనే మాట మనకు తరుచుగా వింటూనే ఉంటాం. ఇక మనకు ఉన్న బిజీ బిజీ లైఫ్‌లో ఇంట్లో పనులు చేసుకునే తీరిక లేక పనివారిపైనా, యంత్రాలపైనా ఆధారపడుతుంటాం. కానీ మన సత్తిరాజు మాత్రం సేంద్రియ పద్దతిలో కూరగాయలు, ఆకు కూరలు, సుమారు 20 రకాల పండ్లు, 40 రకాల కూరగాయలు స్వయంగా పండిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు. అంతే కాదు తన వద్ద బాగా దిగుబడి వచ్చిన కూరగాయల విత్తనాలను అందరికి ఉచితంగా పంపిణి చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనా ల్యాబ్‌లో డేంజరస్ ఫంగస్‌ సృష్టి..ఈసారి వ్యవసాయరంగంపై

ఉదయాన్నే కాఫీ, టీలకు బదులు ఇవి తాగండి.. సూపర్‌ బెనిఫిట్స్‌..!

ఎయిర్ పోర్ట్ లో మహిళ.. ఆమెను గుర్తు పట్టని స్కానర్! ఆమె ఏం చేసిందంటే..?

TOP 9 ET News: వెయ్యి మందితో యుద్ధం.. దద్దరిల్లే ఇంటర్వెల్‌కు నీల్ శ్రీకారం

బాబోయ్‌! మినీ బస్సు సైజులో మొసలిని చూశారా