INS Imphal: నౌకాదళంలో ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌’. యుద్ధనౌకకు నగరం పేరు పెట్టడం ఇదే తొలిసారి.

|

Dec 30, 2023 | 3:58 PM

భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌’ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ముంబయిలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వ నిబద్ధత, రక్షణ రంగంలో భారత స్వావలంబనకు ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌’ నిదర్శనమని రాజ్‌నాథ్‌ అన్నారు. హిందూ మహాసముద్రంలో చైనా నేవీ కదలికలు పెరుగుతున్న వేళ..

భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌’ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ముంబయిలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వ నిబద్ధత, రక్షణ రంగంలో భారత స్వావలంబనకు ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌’ నిదర్శనమని రాజ్‌నాథ్‌ అన్నారు. హిందూ మహాసముద్రంలో చైనా నేవీ కదలికలు పెరుగుతున్న వేళ.. మన దేశ రక్షణ సామర్థ్యానికి ఇది మరింత పదును పెట్టనుంది. భారత నౌకాదళానికి చెందిన ‘వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో’ దేశీయంగా డిజైన్‌ చేసిన నాలుగు ‘విశాఖపట్నం’ శ్రేణి డిస్ట్రాయర్‌లలో ఇది మూడోది. ఈ యుద్ధనౌకను ముంబయిలోని మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌ నిర్మించింది. దేశంలో తయారైన శక్తిమంతమైన వార్‌షిప్‌లలో ఇదొకటి. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం వరకూ ఉండటం విశేషం. ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌ పొడవు 163 మీటర్లు, బరువు 7,400 టన్నులు. గంటకు 56 కిలోమీటర్ల వేగంతో పయనించగలదు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా ‘ఇంఫాల్‌ యుద్ధం’లో పోరాడిన భారత సైనికుల త్యాగాలకు గుర్తింపుగా నౌకకు పేరు ఈ పెట్టారు.

ఈశాన్య రాష్ట్రంలోని ఒక నగరం పేరును ఓ యుద్ధనౌకకు పెట్టడం ఇదే తొలిసారి. ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌లో అధునాతన ఆయుధాలు, సెన్సర్లు ఉన్నాయి. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు, నౌకా విధ్వంసక అస్త్రాలు, టోర్పిడోలను ఈ యుద్ధనౌకలో మోహరించారు. ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌ నిర్మాణ పనులు 2017 మేలో మొదలయ్యాయి. 2019 ఏప్రిల్‌లో దీన్ని జలప్రవేశం చేయించారు. 2023 ఏప్రిల్‌ 28 నుంచి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించారు. ఆరు నెలల్లోనే అక్టోబరులో నౌకాదళానికి అప్పగించారు. నిర్మాణం, పరీక్షలను అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేసుకున్న స్వదేశీ యుద్ధనౌక ఇదే కావడం విశేషం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.