Indigo Pilot: పైలట్‌పై చేయి చేసుకున్న ప్యాసింజర్.. ఇండిగో విమానంలో ఘటన.!
ఢిల్లీ నుంచి గోవా వెళుతున్న ఇండిగో విమానంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. విమానం ఆలస్యమైందని పైలట్ అనౌన్స్ చేస్తుండగా ఆగ్రహానికి లోనైన ఓ ప్రయాణికుడు ముందుకు పరిగెత్తి అతడిపై చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, తొలుత విమానం చాలాసేపు ఆలస్యం కావడంతో మునుపటి పైలట్ స్థానంలో మరో పైలట్ బాధ్యతలు తీసుకున్నారు.
ఢిల్లీ నుంచి గోవా వెళుతున్న ఇండిగో విమానంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. విమానం ఆలస్యమైందని పైలట్ అనౌన్స్ చేస్తుండగా ఆగ్రహానికి లోనైన ఓ ప్రయాణికుడు ముందుకు పరిగెత్తి అతడిపై చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, తొలుత విమానం చాలాసేపు ఆలస్యం కావడంతో మునుపటి పైలట్ స్థానంలో మరో పైలట్ బాధ్యతలు తీసుకున్నారు. ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్స్ నిబంధనల ప్రకారం ఇలాంటి సందర్భాల్లో పైలట్ మార్పు తప్పనిసరి. బడలిక కారణంగా జరిగే పొరపాట్లు నివారించేలా పైలట్లకు తగినంత విశ్రాంతినిచ్చేందుకు ఈ నిబంధనలు రూపొందించారు. ఈ క్రమంలో పైలట్ విమానం ఆలస్యమైన విషయాన్ని ప్రయాణికులకు అనౌన్స్ చేస్తుండగా వెనక కూర్చున్న సాహిల్ కటారియా అనే ప్రయాణికుడు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చి పైలట్‌పై చేయి చేసుకున్నాడు.
ఈ దృశ్యం చూసి విమానం క్రూ ఆశ్చర్యపోయారు. అతడిని అడ్డుకున్న సిబ్బంది విమానం నుంచి దింపేసి అధికారులకు అప్పజెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రయాణికుడి దురుసు ప్రవర్తనను నెటిజన్లు ముక్తకంఠంతో ఖండించారు. ఫ్లైట్ ఆలస్యంలో పైలట్ తప్పేముందని ప్రశ్నించారు. పైలట్ తన బాధ్యత మాత్రమే నిర్వహిస్తున్నాడని గుర్తు చేశారు. ఇలాంటి ప్రయాణికులను మరోసారి విమానం ప్రయాణానికి అనుమతించకుండా నో ఫ్లై జాబితాలో చేర్చాలని కొందరు తేల్చి చెప్పారు. అతడిని అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశారు. కాగా, ఇటీవల కాలంలో పలువురు ప్రయాణికులు ఇండిగో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉదంతాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

