రాళ్ల వానకు బొక్కలు పడ్డ ఇండిగో విమానం వీడియో
దేశ రాజధాని ఢిల్లీలో వడగాలులతో కుండపోత వర్షం కురిసింది. ముందుగా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగా వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈదురుగాలులతో కూడిన వర్షం ఆ వేగంతో వడగాలులు పడడంతో ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో పలుచోట్ల ట్రాఫిక్కుకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి 200 మందికి పైగా ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగాలుల వానలో చిక్కుకొని తీవ్ర కుదుపులకు గురైంది. దాని ముందు భాగం దెబ్బతింది. దీంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురై హాహాకారాలు చేశారు. అప్రమత్తమైన పైలెట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు.
దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్‌కు చర్యలు చేపట్టారు. చివరికి సాయంత్రం 6:30 సమయంలో విమానం సురక్షితంగా కిందకు దించారు. ఆ సమయంలో విమానంలో సిబ్బందితో సహా 227 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్‌లోనే నిలిచిపోయింది. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఒక ఇండిగో విమానం గాలిలో ఉండగా తీవ్ర కుదుపులకు లోనైంది. అందులో ప్రయాణికులు తీవ్ర భయాందోళనతో అరుపులు, కేకలు వేస్తూ గట్టిగా సీట్లను పట్టుకున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో పైలెట్ వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించారు. చివరికి విమానం సురక్షితంగా దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే విమానం ముందు భాగం మాత్రం తీవ్రంగా దెబ్బతింది.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
