వింటర్‌లో వింటేజీ రైలు జర్నీ.. ఈ మార్గంలో ప్రయాణం.. అస్సలు మిస్ కావొద్దు
చలికాలంలో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది. చలిగాలి చక్కిలిగింతలు పెడుతూ ఉంటే, నీరెండ మనసును ఉల్లాస పరుస్తూ ఉంటుంది. ఈ కాలంలో కొండలు, గుట్టలు మంచు దుప్పటిని కప్పుకున్నట్లుగా మారి.. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంటాయి. సరిగ్గా.. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లోని కొన్ని రైళ్లలో చేసే ప్రయాణం.. ఎప్పటికీ నిలిచిపోయే మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
ఈ కాలంలో రైలు విండో దగ్గర కూర్చొని నేచర్ అందాలను చూస్తూ వెళ్తుంటే కాలాన్నే మరిచిపోవాల్సిందే. ఈ శీతాకాలంలో తప్పక చేయాల్సిన కొన్ని అద్భుతమైన రైలు ప్రయాణాలేంటో ఓ లుక్కేద్దాం. ఈ ప్రయాణాల జాబితాలో మొదటిది.. హిమాలయాల ఒడిలో ఒదిగిన జమ్ము – బారాముల్లా రైలు ప్రయాణం. ఇరువైపులా ఎత్తైన హిమాలయ శ్రేణులు, వాటిపై ఆకాశమంత ఎత్తులో ఉండి, మంచు కప్పుకున్న దేవదారు వృక్షాలు మధ్య నుంచి ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. పర్వతాల నుంచి కిందికి దూకే జలపాతాలు, మంచుతో గడ్డకట్టిన నదుల మీదగా సాగే ఈ కల్కా- సిమ్లా టాయ్ జర్నీ ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ కల్కా-సిమ్లా టాయ్ ట్రెయిన్ పొగమంచు నుంచి దూసుకుపోతూ సొరంగాలు, వంతెనల మీదగా సాగుతుంది. ఇక.. ఈ జాబితాలో రెండో రైలు మార్గం.. మెట్లుపాళ్యం నుంచి ఊటీ మధ్యలో ఉంది. మంచు తెమ్మెరల మధ్య పచ్చని టీ తోటలు, దట్టమైన అడవుల గుండా ఈ రైలు ముందుకు సాగుతుంది. ఈ ప్రయాణ సమయంలో మనసుకు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. శీతాకాలంలో ప్రయాణించాల్సిన మరో చక్కటి రైలు ప్రయాణం డార్జిలింగ్ – న్యూ జల్‌పాయ్‌గురి. ప్రకృతి ప్రేమికులకు మర్చిపోలేను అనుభవాన్ని అందిస్తుంది. పొగమంచుతో తడిసి కొత్త శోభను సంతరించుకున్న పచ్చని తేయాకు తోటలు, మంచుతో కప్పబడిన పర్వతాల మధ్యనుంచి సాగే ఈ రైలు ప్రయాణం.. ఆహా అనిపించకమానదు. ఇక.. మీరు పశ్చిమ భారతంలో నివసించేవారో లేక ముంబై వాసులో అయితే.. కచ్చితంగా మాథెరన్ హిల్ రైల్వే జర్నీని అస్సలు మిస్ కాకూడదు. ముంబై సమీపంలోని నేరల్ నుండి మాథేరన్ అనే హిల్ స్టేషన్ వరకు నడిచే నారో-గేజ్ రైల్వే ట్రాక్ మీద సాగే ఈ ప్రయాణం పశ్చిమ కనుమల్లోని పర్వతాలు, లోయలగుండా సాగుతుంది. డెక్కన్ ఒడిస్సీ మహారాష్ట్రలో గొప్ప పర్యటన అనుభూతిని కలిగిస్తుంది. గోవా, అజంతా, ఎల్లోరాలో స్టాప్ లతో ఆకట్టుకుంటుంది. శీతాకాలంలో గోవా బీచ్‌లు, ఎల్లోరా గుహలు అదరహో అనిపిస్తాయి. ఇక.. దేశ వాయువ్య సరిహద్దులోని పఠాన్ కోట్ నుంచి మొదలయ్యే కాంగ్రా వ్యాలీ రైలు ప్రయాణం అద్భుతమైన అనుభూతినిస్తుంది. లోయలు, నదులు, హిల్ స్టేషన్లు ధౌలాధర్ ప్రాంతాలు మంచు దుప్పటిని ధరించి మరింత ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prashanth Varma: ప్రశాంత్ వర్మ Vs నిర్మాతలు.. నిజమేనా ??
నిన్న వరద, నేడు బురద.. ఎటు చూసినా హృదయ విదారకమే
రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నవంబర్ 4 నాటికి మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా ??
