వెంట్రుకలు మొలిపించే ప్రయోగంలో కీలక ముందడుగు వీడియో
తైవాన్ నేషనల్ యూనివర్సిటీ బట్టతల సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా కీలక అడుగు వేసింది. ఒక కొత్త సెరమ్ సహాయంతో 20 రోజుల్లో బట్టతలపై వెంట్రుకలు మొలిపించవచ్చని ప్రకటించింది. ఫ్యాటీ ఆసిడ్లు హెయిర్ ఫాలికల్ స్టెమ్ సెల్స్‌ను పునరుజ్జీవింపజేయడం దీని వెనుక ఉన్న సూత్రం. ఎలుకలపై ఈ ప్రయోగం విజయవంతమైంది, అయితే మానవులపై ప్రయోగ ఫలితాల కోసం వేచి చూడాలి.
బట్టతల సమస్యతో బాధపడుతున్న వారికి తైవాన్ నేషనల్ యూనివర్సిటీ ఆశలు రేపింది. 20 రోజుల్లో బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తామంటూ అక్కడి సైంటిస్టులు గ్యారెంటీ ఇస్తున్నారు. తల చర్మం కింద ఉండే ఫ్యాట్ సెల్స్ విడుదల చేసే కొన్ని ఫ్యాటీ ఆసిడ్లు, హెయిర్ ఫాలికల్ స్టెమ్ సెల్స్‌ను పునరుజ్జీవింపజేసి జుట్టు తిరిగి మొలిచేలా చేస్తాయని పరిశోధకులు తెలిపారు. చర్మానికి గాయమైనప్పుడు యాక్టివేట్ అయ్యే ఫ్యాటీ సెల్స్, ఓలిక్, పల్మిటోలిక్ యాసిడ్ వంటి మోనోశాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లను విడుదల చేస్తాయని, ఇవి నిద్రాణంగా ఉన్న హెయిర్ ఫాలికల్స్‌ను క్రియాశీలం చేస్తాయని వెల్లడైంది. ప్రొఫెసర్ సంగ్ జెన్ లిన్ నేతృత్వంలో తైవాన్ యూనివర్సిటీలో జరిగిన ఈ పరిశోధనలో, ఫ్యాటీ ఆసిడ్స్ సిరమ్‌తో ఎలుకలపై చేసిన ప్రయోగంలో 20 రోజుల్లో వెంట్రుకలు మొలిచాయి.
మరిన్ని వీడియోల కోసం :
తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్ చూసి షాక్ వీడియో
మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో
రూ.11 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు..కానీ వీడియో
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
